https://oktelugu.com/

Sri Reddy On Deepthi Sunaina: దీప్తి సునయనపై విరుచుకపడ్డ శ్రీరెడ్డి.. నువ్వు తిరిగితే తప్పు లేదా.. అలా ఎలా బ్రేకప్ చెప్తావ్!

Sri Reddy On Deepthi Sunaina: ప్రస్తుతం ఎక్కడా చూసినా దీప్తిసునయన-షణ్ముక్ బ్రేకప్ లవ్ స్టోరీ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ విడిపోవడానికి బిగ్ బాస్ షో కారణమని స్పష్టంగా తెలుస్తోంది. సిరితో షణ్ముక్ క్లోజ్‌గా ఉన్నాడన్న కారణంతోనే షన్నూ ఇంటికి వచ్చాక దీప్తి అతని నెంబర్ బ్లాక్ చేసిందని, కనీసం చెప్పేది కూడా వినలేదని వార్తల్ వైరల్ అవుతున్నాయి. ఐదేండ్ల వీరి రిలేషన్ షిప్‌ను బిగ్ బాస్ షో విడగొట్టిందని కొందరు అంటుంటే.. షణ్ముక్ […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 5, 2022 / 11:32 AM IST
    Follow us on

    Sri Reddy On Deepthi Sunaina: ప్రస్తుతం ఎక్కడా చూసినా దీప్తిసునయన-షణ్ముక్ బ్రేకప్ లవ్ స్టోరీ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ విడిపోవడానికి బిగ్ బాస్ షో కారణమని స్పష్టంగా తెలుస్తోంది. సిరితో షణ్ముక్ క్లోజ్‌గా ఉన్నాడన్న కారణంతోనే షన్నూ ఇంటికి వచ్చాక దీప్తి అతని నెంబర్ బ్లాక్ చేసిందని, కనీసం చెప్పేది కూడా వినలేదని వార్తల్ వైరల్ అవుతున్నాయి.

    ఐదేండ్ల వీరి రిలేషన్ షిప్‌ను బిగ్ బాస్ షో విడగొట్టిందని కొందరు అంటుంటే.. షణ్ముక్ సిరితో అలా హగ్గులు, కిస్సులు ఇవ్వడానికి ఏ లవర్ తట్టుకోలేదని కొందరు అంటున్నారు. అదంతా గేమ్‌లో భాగమేనని ఆ మాత్రం దీప్తి అర్థం చేసుకోలేదా అని మరికొందరు షన్నూకు సపోర్టు చేస్తున్నారు.

    Sri Reddy On Deepthi Sunaina

    తాజాగా వీరి బ్రేకప్ విషయమై వివాదాస్పద నటి శ్రీరెడ్డి స్పందించింది. షణ్ముక్‌కు మద్దతుగా దీప్తిపై ఫైర్ అయ్యింది. ఐదేళ్లు షణ్ముక్‌తో రిలేషన్‌లో ఉన్నావ్.. సిరితో క్లోజ్‌గా ఉన్నాడని బ్రేకప్ చెప్పినట్టు అందరికీ అర్థమవుతోంది. అలా ఉంటే నువ్వు కూడా బిగ్ బాస్ షోలో హీరో తనీష్‌తో క్లోజ్‌గా ఉన్నావు కదా..?

    Also Read: జగన్ వదిలిన కొత్త బాణం శ్రీరెడ్డినా?

    అప్పుడు మీ ఇద్దరినీ చూసిన వారంతా లవర్స్ అనుకున్నారు మరి దానికి ఏమంటావ్.. నువ్వు తిరిగితే తప్పులేదు కానీ షణ్ముక్‌ని వేలెత్తి చూపిస్తున్నావు. భారతీయ సంస్కృతిలో ఇప్పటి మహిళలు మూలాలను మర్చిపోతున్నారు. చిన్న సమస్యను కూడా పరిష్కరించుకోలేకపోతున్నారు. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచిస్తే అన్ని సమస్యలకు సమాధానం దొరకుతుంది.

    తప్పులు అన్నాక అందరూ చేస్తారు.. ఇప్పుడంటే మీరు పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఈజీగా బ్రేకప్ చెప్పావు. ఒకవేళ పెళ్లయితే కూడా ఇలానే చెప్పేదానివా? అని దీప్తిని ప్రశ్నించింది శ్రీరెడ్డి.. లవ్‌లో ఉన్నప్పుడు అందరూ టాటూలు వేయించుకుంటారు. బ్రేకప్ అయ్యాక వాటిని తీసేస్తారా? అని అడిగింది. అయితే, షణ్ముక్‌కు దీప్తి బ్రేకప్ చెప్పడానికి వాళ్ల పేరెంట్స్ కారణమని కొందరు అంటున్నారు. బలవంతంగా దీప్తితో బ్రేకప్ చెప్పించారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ పై దీప్తి స్పందింస్తుందో లేదో వేచిచూడాల్సిందే.

    Also Read: దీప్తి-షణ్ముఖ్ బ్రేకప్ కు కారణమైన సిరిని శ్రీహాన్ వదిలేశాడా?

    Tags