
Sreemukhi: బుల్లితెరపై శ్రీముఖి టైం నడుస్తుంది. ఆమె స్టార్ యాంకర్ అయ్యారు. అరడజనుకు పైగా షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ జోరు చూపిస్తున్నారు. పలు ప్రముఖ షోలలో సందడి శ్రీముఖిదే. ఆడియన్స్ శ్రీముఖి గ్లామర్ కి యాంకరింగ్ స్కిల్స్ కి ఫిదా అవుతున్నారు. శ్రీముఖి తనకంటూ ప్రత్యేకమైన శైలి ఏర్పాటు చేసుకుంది. ఇక అందాల ఆరబోతలో అందరికంటే ముందుంటుంది. సౌందర్య ఆరాధకులకు శ్రీముఖి దేవతలా కనిపిస్తున్నారు.
తన యాంకరింగ్ తో శ్రీముఖి షోలకు మంచి టీఆర్పీ రాబడుతుంది. అందుకే పలువురు మేకర్స్ యాంకరింగ్ బాధ్యతలు ఆమెకు అప్పగిస్తున్నారు. తాజాగా బీబీ జోడి అనే డాన్స్ రియాలిటీ షో ఆమె ఖాతాలో చేరింది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న మాజీ కంటెస్టెంట్స్ డాన్స్ షోకి బాగానే ఆదరణ లభిస్తుంది. రెగ్యులర్ డాన్స్ రియాలిటీ షోలకు భిన్నంగా ఉన్న నేపథ్యంలో ఆకట్టుకుంటుంది.
బీబీ జోడితో పాటు మిస్టర్ అండ్ మిసెస్, జాతిరత్నాలు, స్టార్ మా పరివార్ వంటి షోలకు శ్రీముఖి వ్యాఖ్యాతగా ఉన్నారు. యాంకర్ గా రాణిస్తూనే హీరోయిన్ కావాలని కోరుకుంటున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని చిత్రాల్లో కీలక రోల్స్ చేశారు శ్రీముఖి. క్రేజీ అంకుల్స్ చిత్రంలో శ్రీముఖి హీరోయిన్ గా నటించడం విశేషం. అనసూయ, రష్మీ మాదిరి సిల్వర్ స్క్రీన్ మీద కూడా తన మార్కు వేయాలని చూస్తుంది.

ఇక శ్రీముఖి కెరీర్లో ఎదిగిన తీరు చాలా మందికి స్ఫూర్తిదాయకం. హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చిన శ్రీముఖి యాంకర్ గా మారారు. ఆమెకు క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదురయ్యాయట. అందుకే యాంకర్ కావాల్సి వచ్చిందట. తనని తాను నిరూపించుకుంటే హీరోయిన్ కావడం సులభం అవుతుందని నమ్ముతున్నారట. అంతకంతకు తన పాపులారిటీ పెంచుకుంటున్న శ్రీముఖి స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు కొట్టిపారేయలేం.
పటాస్ షోతో శ్రీముఖి యాంకరింగ్ ప్రస్థానం మొదలైంది. బిగ్ బాస్ షోలో పాల్గొనడం ఆమెకు ప్లస్ అయ్యింది. కెరీర్లో ఎదిగే అవకాశం బిగ్ బాస్ కల్పించింది. బిగ్ బాస్ సీజన్ 3లో పార్టిసిపేట్ చేసిన శ్రీముఖి రన్నర్ గా నిలిచారు. రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విన్నర్ అయ్యారు. టైటిల్ కోల్పోయినా రెమ్యూనరేషన్ రూపంలో శ్రీముఖి గట్టిగానే రాబట్టారని సమాచారం.