Sports 2022 Roundup: ఈ ఏడాది క్రీడల్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలే వచ్చాయి. క్రికెట్లో టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు సెమీఫైనల్ లోనే ఇంటిబాట పట్టింది. అయితే లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో విజయం కాస్త ఊరటనిచ్చింది. అయితే అంతకుముందు ఆసియా కప్ లోనూ పాకిస్తాన్ చేతిలో ఓడి అభాసుపాలైంది. వివిధ దేశాల పర్యటనలోనూ సీనియర్లు నిరాశపర్చారు. జూనియర్లు సత్తా చాటారు.

–ఫార్మాట్ ఏదైనా సరే.. బౌలర్ ఎవరైనా తగ్గేదేలే..
2022లో ఇప్పటివరకు చాలా మంది ఫాస్ట్ పేస్ బ్యాట్స్మెన్లు కనిపించారు. క్రికెట్ ఏ ఫార్మాట్ అయినా, పొడవాటి సిక్సర్లు కొట్టినప్పుడు చూడటం ప్రేక్షకులతోపాటు అభిమానులకు ఆనందంగా ఉంటుంది. టీ20 ఇంటర్నేషనల్‌లో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిసినా, కొందరు ఆటగాళ్లు టెస్టుల్లో కూడా చాలా దూకుడుగా ఆడుతున్నారు. ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకపడిన బ్యాట్స్మెన్ల గురించి మనం తప్పక తెలుసుకోవాల్సిందే. ఈ ఏడాది టెస్టు, వన్డే, టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
–బెన్ స్టోక్స్ (టెస్ట్ క్రికెట్)..
ఇంగ్లిష్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఈ ఏడాది (2022) టెస్ట్ క్రికెట్లో చాలా దూకుడు వైఖరిని అవలంబించాడు. ఈ ఏడాది ఇప్పటివరకు టెస్టు క్రికెట్లో స్టోక్స్ మొత్తం 26 సిక్సర్లు బాదాడు. స్టోక్స్ 15 మ్యాచ్‌ల్లో ఆడిన 26 ఇన్నింగ్స్‌ల్లో ఈ సిక్సర్లు బాదాడు. ఈ ఏడాది మాత్రమే కాకుండా ఇప్పటివరకు టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా స్టోక్స్ నిలిచాడు. అతను ఇప్పటివరకు టెస్టుల్లో మొత్తం 107 సిక్సర్లు కొట్టాడు. దీంతో న్యూజిలాండ్ మాజీ బ్యాట్స్‌మెన్ బ్రాండన్ మెక్కల్లాంతో సమానంగా నిలిచాడు.

–నికోలస్ పూరన్ (వన్డే క్రికెట్)..
వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ ఈ ఏడాది ఇప్పటి వరకు వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. 2022లో ఇప్పటివరకు 21 మ్యాచ్‌ల్లో ఆడిన 21 ఇన్నింగ్స్‌ల్లో 27 సిక్సర్లు కొట్టాడు. నికోలస్ పూరన్ తన ఫాస్ట్ బ్యాటింగ్‌కు పేరుగాంచాడు.

–సూర్యకుమార్ యాదవ్ (టీ20 ఇంటర్నేషనల్)..
ఈ ఏడాది టీ20 ఇంటర్నేషనల్‌లో సూర్యకుమార్ యాదవ్ పేరు మాత్రమే వినిపించింది. సూర్య ఈ సంవత్సరం టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్, టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన పరంగా నంబర్ వన్, అత్యధిక సిక్సర్లు కొట్టిన పరంగా నంబర్ వ¯Œ స్థానంలో నిలిచాడు. అతను ఇప్పటి వరకు 31 మ్యాచ్‌ల్లో ఆడిన 31 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 68 సిక్సర్లు బాదాడు.

–టీ20 విజేత ఇంగ్లండ్..
ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్‌కప్ విజేతగా ఇంగ్లాంగ్ నిలిచింది. భారత జట్టు సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయి ఇంటిబాట పట్టింది. ఫైనల్ ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య జరిగింంది. ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బౌలర్లు పాకిస్తాన్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయగా.. బెన్ స్టోక్స్ అజేయ అర్ధశతకం బాదడంతో ఇంగ్లాంగ్ మరో ఓవర్ మిగిలి ఉండగానే గెలిచింది. ఇంగ్లాండ్ బౌలర్లలో సామ్ కర్రన్ మూడు వికెట్లు తీసుకోగా.. అదిల్ రషీద్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లిష్ జట్టు టీ20 వరల్డ్ కప్ గెలవడం ఇది రెండోసారి కాగా.. 2019 వన్డే వరల్డ్ కప్‌ను సైతం ఆ జట్టే గెలిచిన సంగతి తెలిసిందే.
ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ బోల్తా..
దుబయ్ వేదికగా ఈ ఏడాది సెప్టెంబర్లోల నిర్వహించిన ఆసియా కప్ 2022 విజేతగా శ్రీలంక నిలిచింది. పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక 23 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుని.. ఆరోసారి ఆసియా కప్‌ని ముద్దాడింది. మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక టీమ్.. భానుక రాజపక్సె(71 నాటౌట్: 45 బంతుల్లో) అజేయ అర్ధశతకం బాదడంతో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో తడబడిన పాకిస్థాన్ టీమ్ 147 పరుగులకే ఆలౌటైంది. 1984 నుంచి ఆసియా కప్ జరుగుతుండగా.. చివరిగా 2014లో శ్రీలంక టైటిల్ గెలిచింది.
ఉమెన్స్ ఆసియా కప్ విజేత భారత్
ఉమెన్స్ ఆసియా కప్ 2022 విజేతగా భారత్ నిలిచింది. శ్రీలంక ఉమెన్స్ టీమ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో ఆధిపత్యం చెలాయించిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. 8 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. 2004 నుంచి ఆసియా కప్ జరుగుతుండగా.. భారత్ జట్టు ఈ కప్‌ని గెలవడం ఇది ఏడోసారి. మరోవైపు ఐదోసారి ఫైనల్‌కి చేరినా శ్రీలంక కప్ కల మాత్రం నెరవేరలేదు. ఐదు సార్లూ ఫైనల్లో భారత్ చేతిలోనే శ్రీలంక ఓడిపోవడం గమనార్హం.
–ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ చాంపియన్ విజేత అర్జెంటీనా

ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్–2022 చాంపియన్‌గా అర్జెంటీనా అవతరించింది. ఖతార్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌పై గెలుపొంది టైటిల్ ను ముద్దాడింది. ఇచ్చిన టైమ్ లోగా ఇరు జట్లు సమానంగా పాయింట్లు సాధించాయి. దీంతో ఎక్స్ ట్రా టైమ్ ఇచ్చారు. అయినా స్కోర్లు సమంగానే ఉన్నాయి. దీంతో పెనాల్టీ షూటౌట్ ఇచ్చారు. ఇందులో ఫ్రాన్స్ 2 పాయింట్లు చేయగా.. అర్జెంటీనా 4 పాయింట్లు సాధించడంతో ప్రపంచ విజేతగా నిలిచింది. 36 ఏళ్ల తర్వాత ఫిఫా వరల్డ్ కప్ టైటిట్‌ను అర్జెంటీనా కైవసం చేసుకుంది. అర్జెంటీనా జట్టు.. ప్రపంచ విజేతగా నిలవడంతో ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ కల నెరవేరినట్లు అయ్యింది.