Homeట్రెండింగ్ న్యూస్Sperm Donor : నరుడా..ఓ డోనరుడా: ఇక నీ ధారాళాన్ని ఆపు ప్రభూ!

Sperm Donor : నరుడా..ఓ డోనరుడా: ఇక నీ ధారాళాన్ని ఆపు ప్రభూ!

Sperm Donor : విక్కీ డోనర్ అనే సినిమా చూశారా? పోనీ తెలుగులో నరుడా డోనరుడా అయినా తిలకించారా? లేకుంటే ధారాళ ప్రభూ అనే తమిళ్ సినిమా అయినా వాచ్ చేశారా? ఆ సినిమాలన్నీ వీర్యంతో ముడిపడినవి. ఆఫ్ కోర్స్ బాలీవుడ్ లో విక్కీ డోనర్ అనే పేరుతో తీస్తే మిగతా భాషల్లో రీమేక్ చేశారు. దాదాపు అన్ని భాషల్లో ఈ సినిమా హిట్ అయింది. వీర్యం కథాంశంతో రూపొందిన సినిమా ఏం చూస్తారులే అనుకోకుండా బాలీవుడ్ లో ఈ తరహా ప్రయోగం చేయడం పట్ల అప్పుడు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు..కానీ ఆ సినిమా కథాంశం వాస్తవ జీవితానికి దగ్గరగా ఉండటంతో జనాలకు బాగా నచ్చింది. మన సమాజంలో  అలాంటివారు ఉంటారా? ఈ ప్రశ్నకు అవును అనే సమాధానం వస్తున్నది. విక్కీ డోనర్ లాంటి వ్యక్తి నెదర్లాండ్ ప్రాంతంలో ఉన్నాడు. అయితే అతడి వీర్య దానం శృతిమించడంతో కోర్టు మొట్టికాయలు వేసింది.
600 మంది పిల్లలు
నెదర్లాండ్ దేశం హెగ్ పట్టణానికి చెందిన జోనాథన్ మిజెర్ వృత్తి రీత్యా సంగీత కళాకారుడు. డబ్బులు తీసుకొని వీర్యం దానం చేయడం ఇతడి మరొక ప్రవృత్తి. 2007 నుంచి ఇతడు నెదర్లాండ్ లోని ఫెర్టిలిటీ క్లినిక్, స్పెర్మ్ బ్యాంక్ లకు వెళ్లి వీర్యం దానం మొదలుపెట్టాడు.. అంతే కాదు ఆ దేశానికి చెందిన ” డి జైర్ ఏ బేబీ” లాంటి వెబ్సైట్ ద్వారా, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా తన వ్యాపకాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అతడికి నీలి కళ్ళు ఉండటం, వంకీల జుట్టు ఆకర్షణీయంగా ఉండడం, పైగా మంచి రంగుతో ఉండటంతో మహిళలు అతని వీర్యం కోసం పోటీపడేవారు.. దీంతో అతడి వీర్యానికి డిమాండ్ భారీగా ఏర్పడింది.
లెక్క లేదు
2017 నాటికి నెదర్లాండ్ ప్రభుత్వ ధనంకాల ప్రకారం అతడు 102 మంది పిల్లలకు తండ్రిగారు. ఆన్ లైన్, సోషల్ మీడియా ద్వారా తనను సంప్రదించిన మహిళలకు అతడు ప్రైవేటుగా వీర్య దానం చేశాడు. ఇలా పుట్టిన పిల్లలకు లెక్కలేదు. నెదర్లాండ్ చట్టాల ప్రకారం గరిష్టంగా 12 మంది మహిళలకు వీర్యదానం చేయవచ్చు. దీని ద్వారా 25 మంది పిల్లలకు మించి జన్మను ఇవ్వకూడదు. ఈ క్రమంలో డచ్ ప్రభుత్వం ఆ దేశంలోని సంతాన సాఫల్య కేంద్రాలు, స్పెర్మ్ బ్యాంక్ లు అప్పటినుంచి వీర్యం స్వీకరించడం ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది.
వేరే బ్యాంక్ కు..
అయితే ప్రభుత్వం ఈ తరహా నిషేధం విధించడంతో అతడు తెలివిగా డెన్మార్క్ కు “క్రయోస్ ఇంటర్నేషనల్” అనే స్పెర్మ్ బ్యాంకుకు తన వీర్యాన్ని అమ్మడం మొదలుపెట్టాడు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్పెర్మ్ బ్యాంక్. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో ఇది కార్యకర్తలు సాగిస్తూ ఉంటుంది.. ఇలా ఇతడి సంతాన ఉత్పత్తి 600 మంది పిల్లల దాకా చేరుకుంది. అయితే ఈ విషయం నెదర్లాండ్లో ఆ నోటా ఈ నోటా పాకింది. దీంతో అక్కడి మహిళల్లో ఆందోళన ప్రారంభమైంది. ఎందుకంటే జోనాథన్ వేరువేరు మహిళలకు ఇచ్చిన వీర్యం ద్వారా పుట్టిన పిల్లలు మొత్తం రక్తసంబంధీకులే. భవిష్యత్తులో ఆ పిల్లలు రక్తసంబంధం ద్వారానో, లైంగిక సంబంధం ద్వారానో పిల్లలను కంటే దానిని అంత: ప్రజననం(ఇన్ బ్రీడింగ్) అని అంటారు. దీనివల్ల పుట్టే పిల్లల్లో జన్యుపరమైన సమస్యలు ఉంటాయి. అయితే ఈ ఆందోళన వల్లే ఆ మహిళల మొత్తం జోనాథన్ వ్యవహార శైలి పై డచ్ డోనర్స్ చైల్డ్ ఫౌండేషన్ కు ఫిర్యాదు చేశారు. ఆ సంస్థ అతడిపై కోర్టుకు ఫిర్యాదు చేసింది. దీంతో మండిపడ్డ కోర్టు అతడిని వీర్య దానం నిలిపివేయాలని ఆదేశాలు జారి చేసింది. నిబంధనలు అతిక్రమించి అతడు వీర్యదానం చేసినందుకు 9 లక్షల దాకా జరిమానా విధించే అవకాశం ఉంది. ప్రస్తుతం జోనాథన్ వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular