My Village Show Gangavva: గంగవ్వ.. యూట్యూబ్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న వారిలో ఆమెది అగ్రస్థానం. మై విలేజ్ షో యూట్యూబ్ చానల్‌లో మొదట ఒక చిన్న క్యారెక్టర్‌తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఆరు పదుల వయసులో సహజ నటనతో పల్లె, పట్టణం, యువత, వృద్ధులు అనే తేడా లేకుండా అందరినీ తన మాట, నటనతో మంత్రముగ్ధులను చేసింది. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఆ మధ్య బిగ్ బాస్‌లో కూడా సందడి చేసింది. ప్రస్తుతం గంగవ్వ కొంతమంది సెలబ్రిటీలతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు కూడా తీసుకుంటుంది. దీనిని బట్టి గంగవ్వ స్టార్ హోదా ఏ స్థాయిలో పెరిగిందో అర్థమైపోయింది.
భారీ స్థాయిలో క్రేజ్
పక్కా విలేజ్ వాతావరణంతో ఎంతగానో ఆకట్టుకున్న యూట్యూబ్ ఛానల్స్‌లో మై విలేజ్ షో ఛానల్ టాప్ లిస్టులో స్థానం సంపాదించుకుంది. ముఖ్యంగా అందులో గంగవ్వ పాత్ర ఏ స్థాయిలో వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలంగాణ యాసలో పక్కా నేచురల్‌గా ఉండే విధంగా ఆమె నటించే విధానం అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
Also Read: Chiranjeevi – Ramya Krishna: చిరంజీవితో రమ్యకృష్ణ.. ఆమె క్యారెక్టర్ పై క్రేజీ అప్ డేట్
గంగవ్వ కేవలం యూట్యూబ్ ద్వారానే కాకుండా టెలివిజన్ రంగంలో అలాగే సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటూ మంచి ఆదాయాన్ని కూడా సంపాదించుకుంటుంది. ఆ మధ్య బిగ్ బాస్ సీజన్ – 4 లో కూడా కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అందులో మంచి పోటీ ఇచ్చినప్పటికీ అనారోగ్య కారణాల వలన ఆమె మధ్యలోనే బయటకు వెళ్లి పోవాల్సి వచ్చింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గంగవ్వ సొంత ఇంటిని నిర్మించుకుంది. ఇందుకు నాగార్జున ఆర్థిక సహాయం చేశారు.
సెలబ్రిటీల ఇంటర్వ్యూ
గంగవ్వ అప్పుడప్పుడు కొత్త సినిమాల ప్రమోష¯Œ ్స లో భాగంగా సినిమా నటీనటులతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు కూడా చేస్తోంది. మై విలేజ్ షో టీమ్ తో కలిసే ఇదివరకే ఆమె సమంత సాయి పల్లవి తమన్నా అలాగే చాలామంది సెలబ్రిటీలతో కూడా ఇంటర్వ్యూలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రత్యేక ఇంటర్వ్యూల కోసం గంగవ్వకు సంస్థలు ప్రత్యేకంగా కారావాన్ కూడా ఇస్తున్నాయిు. నెట్ ఫ్లిక్స్‌లో విరాటపర్వం విడుదలవుతున్న సందర్భంగా హీరో హీరోయిన్‌తో కలిసి గంగవ్వ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. రానా దగ్గుపాటి సాయిపల్లవి ఇద్దరు కూడా చాలా సరదాగా ఆమెతో మాట్లాడారు. అయితే గంగవ్వ ముందుగానే కారావాన్ వ్లాగ్ వీడియో ద్వారా తన అనుభవాన్ని తెలియజేసింది. చాలా అద్భుతంగా ఉంది అంటూ అందులో సదుపాయాల గురించి కూడా తెలియజేసింది. దాని రేటు దాదాపు రూ.30 లక్షల వరకు ఉంటుందని కూడా చెప్పింది.
Also Read:Hero Nithin: బుల్లితెర సీరియల్స్ లో నటించబోతున్న హీరో నితిన్