Soumya Rao- Hyper Aadi: బాణాల్లా దూసుకొచ్చే హైపర్ ఆది పంచ్ లకు తోటి కమెడియన్లు ఒక్కోసారి తట్టుకోలేకపోతారు. ఆయన వేసే పంచ్ లకు ఏం మాట్లాడో తెలియక అయోమయానికి గురవుతారు. అలాంటి ఆదికి ఇప్పుడు యాంకర్ రీ పంచ్ వేసి పరువు తీసింది. యాంకర్ సౌమ్య వేసిన పంచ్ లకు ఆది షాక్ తిన్నాడు. ‘కామెడీ రాదు.. యాక్టింగ్ రాదు.. కనీసం బైక్ నడపడం కూడా రాదా? ’అని పరువు తీయడంతో ఏంమాట్లాడకుండా తలదించుకున్నాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా ఘొల్లుమని నవ్వారు. హోలీ పండుగ సందర్భంగా ఈ నెల 5న ప్రసారమయ్యే ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ప్రొగ్రాంకు సంబంధించిన ప్రోమోను ఇటీవల రిలీజ్ చేశారు. ఇందులో అందరినీ పంచ్ లతో ఉక్కిరిబిక్కిరి చేసే హైపర్ ఆదినే సౌమ్య వేసిన పంచ్ లు పేలిపోయాయి.
జబర్దస్త్ ప్రొగ్రాంలో సౌమ్యను హైపర్ ఆది ఆడేసుకుంటాడు. తన పంచ్ లతో ఆమెను మాట్లాడనీయకుండా చేస్తాడు. అయితే ఆయనను ఆడేసుకునేందుకు ఇక్కడ సౌమ్యకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఆదిపై పంచ్ లు వేయడం సౌమ్య వంతయింది. ఎప్పుడూ మీదే కాదు.. మాకు అవకాశం వస్తుంది.. అన్నట్లు సౌమ్య వేసిన పంచ్ లకు ఆడియన్స్ గోల గోల చేశారు. ప్రొగ్రామ్ లో భాగంగా ఆది తన స్కూటర్ ను తీసుకొస్తాడు. తనకు బండి నడపరాదు అన్నట్లు కాస్త వణుకుతాడు. ఈ క్రమంలో సౌమ్య ఆదిపై ‘కామెడీ రాదు.. యాక్టింగ్ రాదు.. కనీసం బైక్ నడపడం కూడా రాదా? ’అని వేసే పంచ్ లు పేలిపోతాయి.
హోలీ పండుగ నేపథ్యంలో మార్చి 5 ఆదివారం సాయంత్రం7 గంటలకు దీనిని ఫుల్ ఎపిసోడ్ ప్రసారం చేయనున్నారు. రెగ్యులర్ ప్రొగ్రామ్స్ మాత్రమే కాకుండా ఫెస్టివెల్ సందర్భంగా రిలీజ్ చేసే కార్యక్రమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా మల్లెమాల యాజమాన్యం తాజాగా ‘గండెజారి గల్లంతయ్యిదే’ అనే స్పెషల్ ప్రొగ్రాంను తీసుకొస్తున్నారు. ఇందులో ఆది పర్ఫామెన్స్ మాత్రమే కాకుండా ఇతర నటులు తమ ప్రతిభను చూపించారు.
ఈ ఈవెంట్ కు గెస్ట్ గా నటి శ్రీదేవి హాజరైంది. ఈ సందర్భంగా హైపర్ ఆది,రామ్ ప్రసాద్ షో స్ హైలెట్ గా మారనున్నాయి. వీరే కాకుండా కొందరు డ్యాన్స్ తో ఆకట్టుకున్నారు. రామ్ మిరియాల తన సాంగ్ తో అక్కడున్న వాళ్లలో జోష్ నింపారు. మొత్తానికి ఈ హోలీ పండుగ కు ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నారు. అయితే ఇది ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.