https://oktelugu.com/

Bigg Boss Telugu 6: అమ్మ బాబోయ్… ఆ లేడీ కంటెస్టెంట్స్ ని చూసి జడుసుకుంటున్న ప్రేక్షకులు… ప్లీజ్ మేకప్ వేయండయ్యా!

Bigg Boss Telugu 6: బిగ్ బాస్ షోలో కొందరు లేడీ కంటెస్టెంట్స్ లుక్ దారుణంగా ఉంది. మేకప్ లేకుండా ప్రేక్షకులు వాళ్ళ మొహాలు చూడలేకపోతున్నారు.బిగ్ బాస్ తెలుగు 6 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ లో కలర్ ఫుల్ డ్రెస్సులో మెరిసిపోయిన ఈ కంటెస్టెంట్స్ హౌస్లో మాత్రం భయపెడుతున్నారు. ఒకరిద్దరిని అయితే గుర్తు పట్టడం కూడా కష్టంగా ఉంది. మేకప్ లేకపోతే ఈ సెలెబ్రిటీలు ఇలా ఉంటారా అని ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద […]

Written By:
  • Shiva
  • , Updated On : September 8, 2022 / 12:24 PM IST
    Follow us on

    Bigg Boss Telugu 6: బిగ్ బాస్ షోలో కొందరు లేడీ కంటెస్టెంట్స్ లుక్ దారుణంగా ఉంది. మేకప్ లేకుండా ప్రేక్షకులు వాళ్ళ మొహాలు చూడలేకపోతున్నారు.బిగ్ బాస్ తెలుగు 6 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ లో కలర్ ఫుల్ డ్రెస్సులో మెరిసిపోయిన ఈ కంటెస్టెంట్స్ హౌస్లో మాత్రం భయపెడుతున్నారు. ఒకరిద్దరిని అయితే గుర్తు పట్టడం కూడా కష్టంగా ఉంది. మేకప్ లేకపోతే ఈ సెలెబ్రిటీలు ఇలా ఉంటారా అని ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది. ఫైమా, ఆరోహి రావు, గీతూ రాయల్, నేహా చౌదరి, కీర్తి భట్ లుక్స్ పై ట్రోల్స్, మీమ్స్ పేలుతున్నాయి.

    Bigg Boss Telugu 6

     

    టాప్ సీరియల్స్ లో హీరోయిన్ గా ఉన్న కీర్తి మేకప్ లేకుండా పూర్తి డిఫరెంట్ గా ఉన్నారు, నిజంగా ఆమెను గుర్తు పట్టడం కష్టంగా ఉంది. ఆరోహి రావుతో పాటు గీతూ రాయల్, నేహా చౌదరి, ఫైమా మేకప్ లెస్ లుక్స్ లో షాక్ ఇస్తున్నారు. సాధారణంగా బిగ్ బాస్ హౌస్ అంటే గ్లామరస్ క్వీన్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆటతో పాటు ప్రేక్షకులు వాళ్ళ గ్లామర్ ని ఆస్వాదిస్తారు. ఈ సారి కొందరు లేడీ కంటెస్టెంట్స్ విషయంలో ఇది మిస్ అయ్యింది. ఇక వాళ్ళను గుర్తు పట్టలేకపోతున్నాం.. దయచేసి వాళ్లకు మేకప్ వేయండి అంటూ నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు.

    Also Read: Brahmastra First Review UAE: బ్రహ్మస్త్ర యూఎస్ ప్రీమియర్ రివ్యూ : సినిమా ఎలా ఉందంటే?

    బిగ్ బాస్ లేడీ కంటెస్టెంట్స్ మేకప్ లెస్ లుక్ హాట్ టాపిక్ గా మారింది. ఈ డీగ్లామర్ కంటెస్టెంట్స్ ఏంట్రా బాబు అంటూ పెదవి విరుస్తున్నారు. కాగా ఈ వారానికి నామినేషన్స్ ప్రక్రియ పూర్తి అయ్యింది. మొత్తం 7 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. ఆరోహి రావు, ఇనయ సుల్తానా, సింగర్ రేవంత్, అభినయశ్రీ, జబర్దస్త్ ఫైమా, శ్రీసత్య, చలాకీ చంటి నామినేట్ అయ్యారు. ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా వీరి నుండి వచ్చే ఆదివారం ఒకరు ఎలిమినేట్ కానున్నారు.

    Bigg Boss Telugu 6

    బాల ఆదిత్య సైతం ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. అనూహ్యంగా ఇంటి సభ్యులు తమ నిర్ణయంతో బాల ఆదిత్యను ఎలిమినేషన్ నుండి సేవ్ చేశారు. సింగర్ రేవంత్ పై ఇంటి సభ్యుల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. మెజారిటీ సభ్యులు ఆయన్ని నామినేట్ చేశారు. నామినేషన్స్ సమయంలో ఇంటి సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మెజారిటీ ఇంటి సభ్యుల తిరస్కరణకు గురైన సభ్యులు నామినేషన్స్ లోకి వచ్చారు. ఇక క్లాస్-మాస్-ట్రాష్ టాస్క్ లో భాగంగా ఇనయా సుల్తానా, అభినయశ్రీ నేరుగా ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. మిగిలిన ఐదుగురు సభ్యులు గత ఎపిసోడ్ లో నామినేట్ కావడం జరిగింది.

    Also Read:Venu Madhav: వేణు మాధవ్ మృతికి ఆ వ్యసనాలు కారణమా? భార్య వెల్లడించిన షాకింగ్ నిజాలు!

    Tags