Homeజాతీయ వార్తలుGovernor Tamilisai: రిపబ్లిక్‌ డే నాడూ కేసీఆర్‌ను వదలని గవర్నర్‌ తమిళిసై!

Governor Tamilisai: రిపబ్లిక్‌ డే నాడూ కేసీఆర్‌ను వదలని గవర్నర్‌ తమిళిసై!

Governor Tamilisai: తెలంగాణలో రాజ్‌భవన్, ప్రగతిభవన్‌కు మధ్య కొనసాగుతున్న దూరం రోజురోజుకూ పెరుగుతోంది. రెండేళ్లుగా సీఎం కేసీఆర్, గవర్నర్‌ తమిళిసై మధ్య గ్యాప్‌ కొనసాగుతోంది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల సమయంలో పాడి కౌషిక్‌రెడ్డికి నామినేటెడ్‌ ఎమ్మెల్సీ అంశాన్ని గవర్నర్‌ పెడింగ్‌లో పెట్టారు. అప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు రాజ్‌భవన్‌ గడప తొక్కడం లేదు. ఆహ్వానం పంపినా హాజరు కావడం లేదు. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము శీతాకాల విడిది కోసం ఇటీవల హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సమయంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు మాత్రమే కేసీఆర్‌ గవర్నర్‌తో కలిసి వెళ్లారు. ఈ సమయంలోనూ పెద్దగా మాట్లాడుకోలేదు. ప్రధాన మంత్రి వచ్చినా ప్రొటోకాల్‌ పాటించడం లేదు. ఇక గవర్నర్‌ ప్రొటోకాల్‌ అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. తాజాగా రిపబ్లిక్‌ వేడుకలను కూడా పరేడ్‌ మైదానంలో కాకుండా రాజ్‌భవన్‌లో మొక్కుబడిగా నిర్వహించేలా కారోనా సాకు చూపే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు జోక్యం చేసుకుని కేసీఆర్‌ సర్కార్‌కు మొట్టికాయలు వేసింది. అయినా రాజ్‌భవన్‌లోనే హడావుడిగా కొన్ని ఏర్పాట్లు చేశారు. హైకోర్టు ఆదేశాలతో గవర్నర్‌తో కలిసి రాజ్‌భవన్‌లో ఉన్నతాధికారులు రిపబ్లిక్‌ వేడుకల్లో పాల్గొన్నారు.

Governor Tamilisai
Governor Tamilisai

రి‘పబ్లిక్‌’ స్పీచ్‌లో చురకలు..
రిపబ్లిక్‌ వేడుకల నిర్వహణలో కేసీఆర్‌ సర్కార్‌ వైఖరి సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో.. కేసీఆర్‌పై ఇన్నాళ్లూ ఎలాంటి విమర్శలు చేయని గవర్నర్‌ తమిళిసై మొదటిసారి చురకలు అంటించారు. రి‘పబ్లిక్‌’ వేడుక సాక్షిగా కేసీఆర్‌ సర్కార్‌ను గవర్నర్‌ కేసీఆర్‌ సర్కార్‌పై తనదైన శైలిలో విమర్శలు చేశారు. కొందరికి తాను నచ్చకపోవచ్చని పరోక్షంగా కేసీఆర్‌ను దృష్టిలో పెట్టుకుని అన్నారు. కానీ తెలంగాణ అంటే తనకెంతో ఇష్టమన్నారు. ఎంత కష్టమైనా తెలంగాణ ప్రజల కోసం పని చేస్తానన్నారు. కొత్త భవనాల నిర్మాణం అభివృద్ధి కాదన్నారు. జాతి నిర్మాణమే అభివృద్ధి అని ఆమె అభివర్ణించడం ద్వారా ఫామ్‌హౌస్‌లు కట్టడం అభివృద్ధి కాదని కేసీఆర్‌కు పరోక్షంగా చీవాట్లు పెట్టారు. అందరికీ ఫార్మ్‌లు కావాలని ఆమె ఆకాంక్షించారు.

పుట్టుకతోనే తెలంగాణతో బంధం..
తెలంగాణతో తన బంధం మూడేళ్లు కాదని, పుట్టుకతో ఉందన్నారు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని మహాకవి మాటలు గవర్నర్‌ నోట రావడం విశేషం. రాజ్యాంగం ప్రకారమే తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. మన పిల్లలు విదేశాల్లో చదవడం కాదని, రాష్ట్ర విద్యాలయాలలో అంతర్జాతీయ ఫెసిలిటీ ఉండాలని గవర్నర్‌ చెప్పుకొచ్చారు. తెలంగాణ గౌరవాన్ని నిలబెడదామన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకుందామన్నారు.

Governor Tamilisai
Governor Tamilisai

తెలంగాణలో పరిస్థితులపై ఆందోళన..
తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని గవర్నర్‌ తమిళిసై పిలుపు నిచ్చారు. తెలంగాణలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయన్నారు. రోజుకు 22 ఆత్మహత్యలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ యువత ధైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాఖ్యలతో రిపబ్లిక్‌ దినం సాక్షిగా కేసీఆర్‌ సర్కార్‌తో మరోసారి గవర్నర్‌ పేచీ పెట్టుకున్నట్లయింది. గవర్నర్‌ ఘాటు వ్యాఖ్యలపై కేసీఆర్‌ సర్కార్‌ ఎలా స్పందిస్తుందోననే ఉత్కంఠ నెలకుంది. కేసీఆర్‌ సర్కార్‌పై ఆమె చేసిన విమర్శలను తేలికైనవేమీ కాదు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular