
Socio Economic Survey AP: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందా..? ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తున్నాయా..? అంకెల గారడీతో ప్రజలను మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారా..? సీఎం జగన్మోహన్ రెడ్డి గురువారం విడుదల చేసిన రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే ఏం చెబుతోంది..? ఈ సర్వేలో ఉన్న అంశాలు రాష్ట్ర వాస్తవిక పరిస్థితులను అద్దం పడుతోందా..? ఒకసారి పరిశీలిద్దాం.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, వ్యవసాయం, పరిశ్రమలు సేవా రంగాల్లో తన హవా చాటుతోందని రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే చెబుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. 2022-23 ఏడాదికి గాను ఈ సామాజిక ఆర్థిక సర్వే ఫలితాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గురువారం విడుదల చేశారు. వివిధ విభాగాల్లో రేటును ఇందులో పేర్కొన్నారు.
గతేడాదితో పోలిస్తే అధిక జిఎస్డిపి..
2022-23కి ఆంధ్రప్రదేశ్ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపి) వృద్ధిరేటు 16.22 శాతంగా నమోదు అయినట్లు సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే మరింత వేగంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నట్లు చెప్పింది. గత ఆర్థిక సంవత్సరానికి జిఎస్డిపి 11 లక్షల కోట్లకు పైగా అంచనా వేయగా, ఈ ఏడాది 13 లక్షల కోట్లు లక్ష్యంగా నిర్ణయించారు. అంటే అప్పటితో పోలిస్తే దాదాపు రెండు లక్షల కోట్లు అధికంగా ఉంది.
ప్రధాన రంగాల్లో మంచి వృద్ధి..
వ్యవసాయం, అనుబంధ రంగాల స్థూల విలువ ఆధారిత వృద్ధిరేటు 13.18 శాతంగా నమోదయింది. వ్యవసాయం, మత్స్య సంపద విభాగాల దాదాపు 20 శాతం దగ్గర పోటీపడుతున్నాయి. ఇక పరిశ్రమల రంగం 16.36 శాతం, సేవల రంగం 18.91 శాతం చొప్పున జీవీఏ సాధించాయి. హోటల్స్, రవాణా, రియల్ ఎస్టేట్ విభాగాలు మంచి వృద్ధుని కనబరిచినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
గత ఏడాదితో పోలిస్తే..
2021-22లో దేశవృద్ది రేటు ఏడు శాతం ఉండగా, స్థిరమైన ధరల వద్ద ఆంధ్రప్రదేశ్ రికార్డు స్థాయిలో 7.2 శాతం నమోదు చేసింది. మొత్తంగా చూస్తే వ్యవసాయం 36.19, పరిశ్రమలు 23.36, సేవల రంగం నాలుగో పాయింట్ 4.45 వృద్ధి సాధించాయి. అప్పుడు దాదాపు 2 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం 2022-23లో 2.20 లక్షల కోట్లకు పెరిగింది.
సంక్షేమం, ప్రభుత్వ పథకాలు..
నవరత్నాలు సహా ఇతర పథకాలు విషయానికి వస్తే విద్య, ఆరోగ్యం, మహిళలు, రైతులు సంక్షేమం మొదలైన వాటి కోసం ఎప్పటి వరకు రూ.1.97 లక్షల కోట్లను ఏపీ ప్రభుత్వం వెచ్చించింది. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డిబిటి) ద్వారా ఈ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేసింది. రైతుల సంక్షేమం కోసం 27 వేల కోట్లు కేటాయించుగా 52.38 లక్షల రైతుల కుటుంబాలు లబ్ధి పొందాయి.
ఏజ్ ఆఫ్ డూయింగ్ లో అగ్రస్థానం..
విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్-2023ను ఏపీ ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించింది. ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు రూ.13.42 లక్షల కోట్ల విలువైన 378 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఈ జాబ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ వరుసగా మూడేళ్ల పాటు మొదటి ర్యాంకును పొందింది. తద్వారా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని చూడకున్నట్లు సామాజిక ఆర్థిక సర్వే 2022-23 పేర్కొంది.

లెక్కల గుట్టు నిజమేనా..?
ప్రభుత్వం చెబుతున్నట్లు సామాజిక ఆర్థిక సర్వే లో రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధి సాధించినది నిజమేనా అన్న అనుమానం సర్వత్రా వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం ఈ సర్వేలో భాగంగా పేర్కొన్న పలు అంశాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. రాష్ట్రంలో రవాణా రంగం గొప్పగా ఉందని చెబుతున్న ప్రభుత్వం.. అసలు రాష్ట్రంలో రోడ్లు అద్వాన స్థితిలో ఉన్నాయని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ గణాంకాలు అనుమానాలకు కారణమవుతున్నాయి. ఈ జాబ్ డూయింగ్ బిజినెస్ లో కూడా మూడేళ్లపాటు అగ్రస్థానంలో రాష్ట్రం కొనసాగుతున్నట్లు ఈ సర్వేలో వెళ్లడైంది. అయితే రాష్ట్రం నుంచి అనేక పరిశ్రమలు ఇతర చోట్లకు వెళ్ళిపోతున్న నేపథ్యంలో బిజినెస్ కు అనుకూలమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇక నిన్న గాక మొన్న పెట్టిన గ్లోబల్ సమ్మిట్ వేదికగా చేసుకున్న ఎంవోయుల విషయాన్ని ఈ సర్వేలో పేర్కొనడం గమనార్హం. ఈ ఎంఓయులు క్షేత్రస్థాయిలో పెట్టుబడులను పెట్టేది ఎప్పుడో తెలియదు గాని సర్వేలో ఈ విషయాన్ని హైలెట్ చేయడం గమనార్హం. ఇక ప్రభుత్వం చెబుతున్నట్లుగా రాష్ట్రంలోని ప్రజలు జీవనస్థితిగతుల్లో మార్పులు వచ్చాయా అంటే అది పెద్ద ప్రశ్నగానే మిగిలిపోతుందన్న చర్చ నడుస్తోంది.