https://oktelugu.com/

sitara Krishna: సూపర్ స్టార్ తాతతో మహేష్ బాబు కూతురు లంచ్ డేట్

sitara Krishna: సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి అయిన సితార తన తాతతో సరదాగా గడిపింది. ఆ ఫొటోలు పంచుకోగా వైరల్ అయ్యాయి. సితారకు ఇన్ స్టాగ్రామ్ లో దాదాపు 5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె క్రమం తప్పకుండా తన రోజువారీ కార్యక్రమాల ఫొటోలను అందులో పంచుకుంటుంది. తన తండ్రి, తల్లి, సోదరుడితో గడిపిన ప్రేమానురాగాలను తీపి జ్ఞాపకాలను పోస్ట్ చేస్తుంటుంది. సోమవారం సితార తన సూపర్ స్టార్ తాత కృష్ణతో […]

Written By:
  • NARESH
  • , Updated On : December 20, 2021 / 09:26 PM IST
    Follow us on

    sitara Krishna: సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి అయిన సితార తన తాతతో సరదాగా గడిపింది. ఆ ఫొటోలు పంచుకోగా వైరల్ అయ్యాయి. సితారకు ఇన్ స్టాగ్రామ్ లో దాదాపు 5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె క్రమం తప్పకుండా తన రోజువారీ కార్యక్రమాల ఫొటోలను అందులో పంచుకుంటుంది. తన తండ్రి, తల్లి, సోదరుడితో గడిపిన ప్రేమానురాగాలను తీపి జ్ఞాపకాలను పోస్ట్ చేస్తుంటుంది.

    Sitara

    సోమవారం సితార తన సూపర్ స్టార్ తాత కృష్ణతో కలిసి లంచ్ డేట్ చేసినట్టు ఫొటో పెట్టి ఆనందాన్ని వ్యక్తం చేసింది. ‘తాతగారితో లంచ్ ఎప్పుడూ అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రపంచం మొత్తం మీద ఆయనే బెస్ట్ తాత’.. మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను’ అని సితార తాత కృష్ణతో ఫొటో దిగి దాన్ని పోస్ట్ చేసి క్యాప్షన్ ఇచ్చింది.

    సితారకు తన తాత పట్ల ఉన్న ప్రేమ, విధేయతలకు లైక్ లు, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. చాలా కాలం తర్వాత ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ కృష్ణను చూసేందుకు సూపర్ స్టార్ అభిమానులు థ్రిల్ అవుతున్నారు.

    సూపర్ స్టార్ కృష్ణ తరచూగా తన కుటుంబ సభ్యులతో వీకెండ్ లో సమావేశమవుతుంటాడు. కానీ తొలిసారి తన మనవరాలితో లంచ్ డేట్ కు వచ్చి ఆమెతో సరదాగా గడిపినట్టు తెలుస్తోంది.