
Sir Box Office Collections: ధనుష్ హీరో గా నటించిన మొట్టమొదటి తెలుగు సినిమా ‘సార్’ నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ తెలుగు మరియు తమిళం బాషలలో విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి తెల్సిందే.ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం 6 కోట్ల రూపాయిలకు మాత్రమే జరిగింది. కానీ మొదటి రోజు ఈ సినిమాకి దాదాపుగా రెండు కోట్ల 75 లక్షల రూపాయిలు వచ్చాయి. అంటే పెట్టిన డబ్బులలో 50 శాతం రికవరీ మొదటి రోజే రాబట్టింది అన్నమాట.ఇది మామూలు విషయం మాత్రం కాదు.
ఎందుకంటే ఎప్పటి నుండో టాలీవుడ్ లో ఉంటూ వస్తున్న చాలా మంది మీడియం రేంజ్ స్టార్ హీరోలకు కూడా ఈ రేంజ్ వసూళ్లు రాలేదు, అలాంటిది ధనుష్ తన మొదటి తెలుగు సినిమాతోనే ఇలాంటి ఫీట్ ని అందుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు.
ఇక రెండవ రోజు అయితే మార్నింగ్ షోస్ నుండే దుమ్ములేచిపోయే ఆక్యూపెన్సిలను నమోదు చేసుకుంది ఈ సినిమా.రెండవ రోజు చాలా చోట్ల ఈ సినిమాకి మొదటి రోజుకంటే ఎక్కువ వసూళ్లు రావడం ట్రేడ్ పందితులను సైతం ఆశ్చర్యపొయ్యేలా చేసింది. దానికి తోడు శివరాత్రి కూడా అవ్వడం తో ఈ సినిమా నేడు 3 కోట్ల రూపాయిలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు విశ్లేషకులు.

అంటే రెండు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది అన్నమాట.ఇదే ఫ్లో ని కొనసాగిస్తే ఫుల్ రన్ లో 20 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేస్తుందంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ సినిమానే ఇంత పెద్ద హిట్ అయితే త్వరలోనే ధనుష్ శేఖర్ ఖమ్ముల తో చెయ్యబోతున్న సినిమా ఇంకెంత పెద్ద హిట్ అవుతుందో అన్ని ఇప్పటి నుండే లెక్కలు వేసుకుంటున్నారు.