https://oktelugu.com/

Singer Sunitha : అభిమానులకు సింగర్ సునీత భారీ షాక్… స్టార్ హీరో మూవీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ?

Singer Sunitha : 17 ఏళ్లకే పరిశ్రమలో అడుగుపెట్టారు సింగర్ సునీత. గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఆమె రెండున్నర దశాబ్దాలకు పైగా ప్రయాణం చేస్తున్నారు. వేల పాటలు పాడారు. వందల సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేశారు. కాగా సునీత నటిగా సరికొత్త అవతారం ఎత్తుతున్నారనేది ఇండస్ట్రీలో లేటెస్ట్ హాట్ న్యూస్. మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో భారీ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతుంది. త్వరలో షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. ఒక కీలక రోల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 8, 2022 / 09:51 PM IST
    Follow us on

    Singer Sunitha : 17 ఏళ్లకే పరిశ్రమలో అడుగుపెట్టారు సింగర్ సునీత. గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఆమె రెండున్నర దశాబ్దాలకు పైగా ప్రయాణం చేస్తున్నారు. వేల పాటలు పాడారు. వందల సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేశారు. కాగా సునీత నటిగా సరికొత్త అవతారం ఎత్తుతున్నారనేది ఇండస్ట్రీలో లేటెస్ట్ హాట్ న్యూస్. మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో భారీ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతుంది. త్వరలో షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. ఒక కీలక రోల్ కోసం దర్శకుడు త్రివిక్రమ్ సునీతను కలిశారట. కథతో పాటు తన పాత్ర నచ్చడంతో సునీత ఎస్ చెప్పారట.

    ఇప్పటి వరకు తెర వెనుక ఉన్న ఆమె తెరపైకి రానున్నారట. సిల్వర్ స్క్రీన్ పై తన ప్రజెన్స్ చూపించనున్నారట. సీనియర్ హీరోయిన్ శోభన మహేష్ తల్లి పాత్ర చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది . ఈ క్రమంలో సునీత పాత్రపై ఆసక్తి నెలకొంది. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. సోషల్ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. మరోవైపు సునీత కొడుకు ఆకాష్ ని హీరోగా పరిచయం చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. సునీత భర్త రామ్ నిర్మాతగా ఆకాష్ మూవీ ఉంటుందట.

    ఆకాష్ నటనలో శిక్షణ తీసుకొని పూర్తి స్థాయిలో సన్నద్ధం అయ్యారట. బడ్జెట్ కూడా పెద్ద మొత్తంలో ఖర్చు చేసి గ్రాండ్ గా లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నారట. దర్శకుడు, స్క్రిప్ట్ సైతం ఫైనల్ అయ్యాయనేది చిత్ర వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇక సునీత కూతురు శ్రేయ సింగర్ గా సెటిల్ కావాలి అనుకుంటున్నారు. ఆల్రెడీ ఆమె ప్లే బ్యాక్ సింగర్ గా కొన్ని చిత్రాలకు పని చేశారని సమాచారం. ఇద్దరు పిల్లలను చిత్ర పరిశ్రమలో ఒక స్థాయికి తీసుకెళ్లాలని సునీత సీరియస్ గా ట్రై చేస్తున్నారు.

    కాగా సునీత 19 ఏళ్ళ వయసులో ప్రేమ వివాహం చేసుకున్నారు. మొదటి భర్తతో ఆమెకు విభేదాలు తలెత్తాయి. విడాకులు తీసుకున్న సునీత చాలా కాలంగా పిల్లలతో పాటు పేరెంట్స్ వద్ద ఉంటున్నారు. ఒక దశలో సునీత ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నారనే వాదన ఉంది. కాగా లాక్ డౌన్ సమయంలో మాంగో మీడియా అధినేత రామ్ సునీతకు పెళ్లి ప్రపోజల్ పెట్టారు. సునీత కుటుంబ సభ్యులు, పిల్లలతో చర్చించి రెండో పెళ్లి నిర్ణయం తీసుకున్నారు. 42 ఏళ్ల వయసులో మళ్ళీ పెళ్లా, అని విమర్శలు వెల్లువెత్తాయి. పిల్లల భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం అంటూ.. సునీత అభిమానులకు సమాధానం చెప్పుకున్నారు.