https://oktelugu.com/

Singer Mangli: సొంత ఊరిలో సింగర్ మంగ్లీ చేసిన ఈ పనితెలిస్తే తట్టుకోలేరు

Singer Mangli: జానపద గేయాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న సింగర్ మంగ్లీ..యూట్యూబ్ లో బోనాలు మరియు ఇతర పండుగలు వచ్చినప్పుడు మంగ్లీ ప్రత్యేకంగా పాడే పాటలు మరియు డాన్స్ వీడియోలకు మిలియన్ల సంఖ్య లో వ్యూస్ వస్తాయి..అలా యూట్యూబ్ వీడియోస్ ద్వారా మంచి గుర్తింపుని తెచ్చుకున్న మంగ్లీ కి సినిమాల్లో పాడే అవకాశాలు కూడా బాగా వచ్చాయి..ప్రస్తుతం ఈమె టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న సింగర్స్ లో ఒకరు..ముఖ్యంగా ఈమె లవ్ స్టోరీ లో పాడిన […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 1, 2022 / 01:06 PM IST
    Follow us on

    Singer Mangli: జానపద గేయాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న సింగర్ మంగ్లీ..యూట్యూబ్ లో బోనాలు మరియు ఇతర పండుగలు వచ్చినప్పుడు మంగ్లీ ప్రత్యేకంగా పాడే పాటలు మరియు డాన్స్ వీడియోలకు మిలియన్ల సంఖ్య లో వ్యూస్ వస్తాయి..అలా యూట్యూబ్ వీడియోస్ ద్వారా మంచి గుర్తింపుని తెచ్చుకున్న మంగ్లీ కి సినిమాల్లో పాడే అవకాశాలు కూడా బాగా వచ్చాయి..ప్రస్తుతం ఈమె టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న సింగర్స్ లో ఒకరు..ముఖ్యంగా ఈమె లవ్ స్టోరీ లో పాడిన ‘సారంగ దరియా’ పాట ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే.

    Singer Mangli

    అలా ఇండస్ట్రీ కి వచ్చిన అనతికాలం లోనే మంచి గుర్తింపుని మరియు సంపదని దక్కించుకున్న మంగ్లీ తన చెల్లి ని కూడా ఇండస్ట్రీ కి పరిచయం చేసింది..ఈమె పుష్ప సినిమా లో సమంత ఐటెం సాంగ్ ‘ఉ అంటావా మామ’ పాట పాడింది..ఈ సాంగ్ నేషనల్ లెవెల్ లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

    ఇది ఇలా ఉండగా మంగ్లీ బాషా మరియు యాస తెలంగాణ ని పోలి ఉన్నప్పటికీ ఆమె స్వస్థలం మాత్రం అనంతపురం కి చెందిన గుత్తి దగ్గర బసినేపల్లి అనే తండాకు చెందిన వ్యక్తి..అయితే ఇటీవలే ఆమె తన సొంత ఊరులో తన సొంత ఖర్చులతో అందమైన ఆంజనేయ స్వామి గుడిని నిర్మించింది..ఈ గుడి ఇప్పుడు ఆ గ్రామం లోనే ప్రఖ్యాతి గాంచిన గుడిగా నిరంతరం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది..ముఖ్యంగా ఈ ఆలయం లో హనుమాన్ జయంతి మరియు శ్రీరామనవమి నాడు పెద్ద ఎత్తున పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

    Singer Mangli

    కేవలం ఆ గ్రామప్రజలు మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు ఇక్కడకి వచ్చి పూజలు చేసుకుంటారు..ఇక ఆలయం గర్భగుడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి..రాతి తో ఎంతో అందంగా కట్టబడియున్న ఈ గర్భగుడి చుట్టూ అంజనీత స్వామి సంబంధించిన వివిధ ప్రతిమాలతో ఎంతో సుందరంగా నిర్మించారు..అలా ఎన్నో ప్రత్యేకలతో మంగ్లీ నిర్మించిన ఈ గుడికి ఇంత విశిష్ట ప్రాముఖ్యత రావడం విశేషం.

    Tags