Singer KK : సినీ పరిశ్రమలో మరో విషాదం అలుముకుంది. పాటలు పాడుతూనే మరో సింగర్ గుండెపోటుతో మరణించడం అందరినీ షాక్ కు గురిచేసింది. ప్రముఖ బాలీవుడ్ సింగర్ కృష్ణకుమార్ కున్నాత్ సడెన్ గా కన్నుమూశారు. కేకే గా ప్రసిద్ధి చెందిన ఆయన కోల్ కతాలోని ఒక కాన్సర్ట్ లో ప్రదర్శన చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే కేకే ను ఓ ప్రైవేటు ఆష్పత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
కేకే కోల్ కతాలో ఓ లైవ్ పాటల కచేరీలో పాడాడు. దాన్ని సోషల్ మీడియాలో లైవ్ కూడా ఇచ్చారు. కానీ హఠాత్తుగా కుప్పకూలి మరణించడం విషాదం నింపింది.
53 ఏళ్ల కేకే సినీ ఇండస్ట్రీలో ప్రముఖ గాయకుడు.. ఆయన హిందీతోపాటు తెలుగు, తమిళ, మలయాళం, మరాఠి, బెంగాలీ తదితర భాషల్లో పాటలను పాడాడు. బాలీవుడ్ లో కేకేకు వర్సటైల్ సింగర్ గా ఆయనకు పేరుంది. ఆయన పాడిన ఎన్నో పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి.
Also Read: Pawan Kalyan Konaseema: ‘కోనసీమ’ కేసులు.. రంగంలోకి పవన్ కళ్యాణ్.. ఇక పోరాటమే!
కేకే హఠాన్మరణంతో ప్రధాని మోడీ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలుపుతున్నారు. ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్ అకాల మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నా.. అతడి పాటలు అనేక రకాల భావోద్వేగాలను ప్రతిబింబిస్తాయని కొనియాడారు. కేకే కుటుంబ సభ్యులు, అభిమానులకు సానుభూతి తెలిపారు అని ట్వీట్ చేశాడు.
-కేకే బయోగ్రఫీ
కేకే ఢిల్లీలో జన్మించాడు. 1999లో బాలీవుడ్ చిత్రం ‘పాల్’ సినిమాతో పరిచయమయ్యాడు. అనంతరం పలు హిట్ సాంగ్స్ పాడి భారతీయ చలన చిత్ర పరిశ్రమలో నేపథ్య గాయకుడిగా తనదైన ముద్ర వేసుకున్నాడు. తెలుగులోనూ ఎన్నో మెలోడీ పాటలు కేకే పాడాడు.
Also Read: Kamal Haasan- Venkatesh: అప్పట్లోనే కమల్ పాన్ ఇండియా స్టార్… వెంకీ ఆసక్తికర వ్యాఖ్యలు
-కేకే పాట పాడిన తర్వాత గుండెపోటుకు గురైన వీడియో
Recommended Videos: