Telugu Indian Idol: చిరంజీవికే ఆటోగ్రాఫ్ ఇచ్చిన యువ సింగర్ ఎవరో తెలుసా!

Telugu Indian Idol: సంగీత సుస్వారాల వేదిక ‘తెలుగు ఇండియన్ ఐడల్’. ఈ సుధీర్ఘ పాటల ప్రయాణం ముగిసింది. 17 వారాల పాటు సాగిన ఈ సింగింగ్ షోలో చివరకు వాగ్దేవి విజేతగా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి, హీరో రానా, హీరోయిన్ సాయిపల్లవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఫైనల్ కు చేరిన ఐదుగురు కంటెస్టెంట్స్ వేదికపై పాటలతో హోరెత్తించారు. ఇందులో చివరకు వాగ్దేవి విజేతగా నిలిచి రూ.10లక్షల బహుమతితోపాటు చిరంజీవి, ఇతర స్పాన్సర్స్ అందించిన సొమ్మును తన […]

Written By: NARESH, Updated On : June 18, 2022 10:58 am
Follow us on

Telugu Indian Idol: సంగీత సుస్వారాల వేదిక ‘తెలుగు ఇండియన్ ఐడల్’. ఈ సుధీర్ఘ పాటల ప్రయాణం ముగిసింది. 17 వారాల పాటు సాగిన ఈ సింగింగ్ షోలో చివరకు వాగ్దేవి విజేతగా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి, హీరో రానా, హీరోయిన్ సాయిపల్లవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఫైనల్ కు చేరిన ఐదుగురు కంటెస్టెంట్స్ వేదికపై పాటలతో హోరెత్తించారు. ఇందులో చివరకు వాగ్దేవి విజేతగా నిలిచి రూ.10లక్షల బహుమతితోపాటు చిరంజీవి, ఇతర స్పాన్సర్స్ అందించిన సొమ్మును తన ఖాతాలో వేసుకుంది.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసి షోలో చేసిన సందడి అంతా ఇంతాకాదు.. పాటలకు హమ్ చేస్తూ.. డ్యాన్సులు చేస్తూ సింగర్స్ తో కలిసి సాన్నిహిత్యంగా కదులుతూ వారిలో జోష్ నింపిన వైనం అందరినీ ఆకట్టుకుంది.

సందెపొద్దుల కాడ అంటూ చిరంజీవి పాట పాడింది సింగర్ ప్రణళి. ఈ పాటకు మైమరిచిపోయిన చిరంజీవి తన పాత హీరోయిన్ గుర్తుకు వచ్చిందంటూ స్టేజీపైకి వచ్చి ప్రణతికి ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చాడు. ప్రణతి గొప్ప సింగర్ అవుతుంటూ మొదటి ఆటోగ్రాఫ్ తనకే ఇవ్వాలని తీసుకోవడం హైలెట్ గా నిలిచింది.

అందరూ చిరంజీవి ఆటోగ్రాఫ్ కోసం ఎదురుచూస్తారు. కానీ ఏకంగా ఈ సింగర్ ప్రణతి ఆటోగ్రాఫ్ నే మెగాస్టార్ తీసకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఈమె ఎవరు? అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

అద్భుతంగా పాడిన సింగర్ ప్రణతి తెలంగాణకు చెందిన ప్లేబ్యాక్ సింగర్. తెలంగాణలోని హైదరాబాద్ లోనే పుట్టిపెరిగింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతోంది.

చిన్నతనంలో ఆమె తల్లి హేమ ప్రణతి గానప్రతిభను గుర్తించింది. తర్వాత ప్రణతి తల్లిదండ్రులు ఆమెను సమీపంలోని శ్రీలక్ష్మీ నడుపుతున్న సింగింగ్ ఇన్ స్టిట్యూట్ లో చేర్చారు. ఆ తర్వాత సంగీత ఉపాధ్యాయుడు రామాచారి వద్ద లైట్ మ్యూజిక్ నేర్చుకుంది. నిహాల్ వద్ద శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు.

ఆ తర్వాత కొన్ని పాటల పోటీల్లో పాల్గొని రెండు షోలలో విజయం సాధించింది. 2015లో జీతెలుగు నిర్వహించిన ‘సరిగమప లిటిల్ చాంప్స్’ లో పాల్గొని టైటిల్ గెచుకుంది. ఈ క్రమంలోనే ఒక షోలో లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణిని కలిసింది. ఆ తర్వాత బాహుబలి సినిమాకి కోరస్ పాడే అవకాశం ఆమెకు వచ్చింది. కీరవాణి సినిమాలకు కోరస్ సింగర్ గా పనిచేస్తోంది. ప్రస్తుతం తెలుగు ఇండియన్ ఐడల్ మొదటి సీజన్ లో ఫైనల్స్ వరకూ చేరుకుంది. ఏకంగా చిరంజీవికే ఆటోగ్రాఫ్ ఇచ్చి వార్తల్లో నిలిచింది.

ఇండియన్ ఐడల్ తెలుగు ఫైనల్ అంగరంగ వైభవంగా జరిగింది. అబ్బురపరిచే పర్ ఫామెన్స్ తో కంటెస్టెంట్స్ అలరించారు. పాటలతో ఉర్రూతలూగించారు. చిరంజీవి సరదా.. రానా, సాయిపల్లవి అతిథులుగా అలరించారు. ఈ సందర్భంగా రాంచరణ్-రానా చిన్ననాటి జ్ఞాపకాలను చిరంజీవి వేదికపై పంచుకొని అందరినీ సర్ ప్రైజ్ చేశారు.