Simhadri vs Khushi : త్వరలోనే ‘సింహాద్రి’ రీరిలీజ్.. ‘ఖుషి’ రికార్డ్స్ ని బ్రేక్ చేయబోతుందా?

Simhadri vs Khushi : ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ ట్రెండ్ ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు ఫ్యాన్స్ తమ అభిమాన హీరోల పుట్టినరోజు నాడు జల్సా మరియు పోకిరి సినిమాల స్పెషల్ షోస్ ని వేసుకున్నారు.. వాటికి అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో బయ్యర్స్ దృష్టి రీరిలీజ్ వైపు మరలింది.. స్టార్ హీరోల కెరీర్స్ లో మైల్ స్టోన్స్ గా నిలిచిపోయిన సినిమాలను కొన్ని రీ రిలీజ్ […]

Written By: NARESH, Updated On : January 17, 2023 8:11 pm
Follow us on

Simhadri vs Khushi : ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ ట్రెండ్ ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు ఫ్యాన్స్ తమ అభిమాన హీరోల పుట్టినరోజు నాడు జల్సా మరియు పోకిరి సినిమాల స్పెషల్ షోస్ ని వేసుకున్నారు.. వాటికి అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో బయ్యర్స్ దృష్టి రీరిలీజ్ వైపు మరలింది.. స్టార్ హీరోల కెరీర్స్ లో మైల్ స్టోన్స్ గా నిలిచిపోయిన సినిమాలను కొన్ని రీ రిలీజ్ చేసారు.

పెద్దగా ఏ సినిమా కూడా వర్కౌట్ అవ్వలేదు..కానీ పవన్ కళ్యాణ్ ఖుషి చిత్రాన్ని రీ రిలీజ్ చెయ్యగా బంపర్ ఓపెనింగ్ దక్కింది..స్టార్ హీరో కొత్త సినిమాకి ఎలాంటి వసూళ్లు అయితే వస్తాయో, ఈ సినిమాకి కూడా అలాంటి వసూళ్లే వచ్చాయి..అందరూ షాక్ అయ్యారు..ఇక ఆ తర్వాత మహేష్ బాబు ‘ఒక్కడు’ సినిమా రీ రిలీజ్ అయ్యింది..అది పెద్దగా ఆడలేదు.

ఇప్పుడు ఖుషి రికార్డ్స్ ని ఎలా అయినా బద్దలు కొట్టాలి అనే కసితో ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్..ఎన్టీఆర్ కి మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టిన ‘సింహాద్రి’ సినిమాని 4Kకి మార్చి విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.. మే 20వ తారీఖున ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు ఫ్యాన్స్..దీనికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ప్రారంభం అయ్యాయి.. నిన్ననే అధికారికంగా ప్రకటన చేసారు..అయితే ఈ చిత్రం ఖుషి రికార్డ్స్ ని బద్దలు కొడుతుందా లేదా అనేది చూడాలి.

ఖుషి చిత్రానికి మొదటి రోజు 4 కోట్ల 30 లక్షల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయి.. పది రోజుల పాటు ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అయ్యింది.. ఫుల్ రన్ లో దాదాపుగా 8 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి ఆల్ టైం ఇండియన్ రికార్డు గా నిలిచింది.. మరి ఇలాంటి భారీ రికార్డు ని సింహాద్రి బద్దలు కొడుతుందా? లేదా? అనేది చూడాలి.. సింహాద్రి చిత్రాన్ని వెయ్యికి పైగా థియేటర్స్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.