https://oktelugu.com/

Siddharth – Aditi Hydari : రోడ్డు మీద పిచ్చి గంతులేసిన సిద్దార్థ్ – అదితి హయాద్రి జంట..వైరల్ అవుతున్న వీడియో

Siddharth – Aditi Hydari : గత కొంత కాలం నుండి సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన జంట సిద్దార్థ్ మరియు అదితి హయాద్రి.వీళ్లిద్దరు గత కొంతకాలం నుండి ప్రేమించుకుంటున్నారని, ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి ద్వారా ఒకటి అవ్వబోతున్నారంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.మహా సముద్రం అనే సినిమా ద్వారా పరిచయమైనా వీళ్లిద్దరి స్నేహం, ఆ తర్వాత ప్రేమగా మారిందని టాక్. ఎంతో కాలం నుండి ఈ వార్త ప్రచారం లో […]

Written By:
  • NARESH
  • , Updated On : April 17, 2023 / 10:38 PM IST
    Follow us on

    Siddharth – Aditi Hydari : గత కొంత కాలం నుండి సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన జంట సిద్దార్థ్ మరియు అదితి హయాద్రి.వీళ్లిద్దరు గత కొంతకాలం నుండి ప్రేమించుకుంటున్నారని, ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి ద్వారా ఒకటి అవ్వబోతున్నారంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.మహా సముద్రం అనే సినిమా ద్వారా పరిచయమైనా వీళ్లిద్దరి స్నేహం, ఆ తర్వాత ప్రేమగా మారిందని టాక్.

    ఎంతో కాలం నుండి ఈ వార్త ప్రచారం లో ఉన్నప్పటికీ అటు అదితి రావు హయాద్రి కానీ, ఇటు సిద్దార్థ్ కానీ ఈ వార్తలపై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు.కానీ వీళ్లిద్దరు కలిసి ప్రైవేట్ పార్టీలకు వెళ్లడం, కలిసి ఒకే ఇంట్లో ఉండడం వంటివి మనం గమనిస్తూనే ఉన్నాయి.ఎన్నో వీడియోస్ లో వీళ్లిద్దరు అడ్డంగా కెమెరాకి చిక్కిన సందర్భాలు ఉన్నాయి.అయితే సిద్దార్థ్ పుట్టిన రోజు సందర్భంగా అదితి రావు హయాద్రి విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తోంది.

    రోడ్డు మీద వీళ్ళద్దరు సరదాగా వేసిన పిచ్చి గంతులను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది అదితి రావు హయాద్రి.ఇద్దరికీ 40 ఏళ్ళ వయస్సు ఉంటుంది, ఇంకా చిన్న పిల్లల చేష్టలు పోలేదంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.గతం లో సిద్దార్థ్ శృతి హాసన్ మరియు సమంత వంటి స్టార్ హీరోయిన్స్ తో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే.

    సమంత తో ప్రేమాయణం పెళ్లి పీటల వరకు వెళ్ళింది, కేవలం ఆమెని పెళ్లి చేసుకోవడం కోసం తన భార్య కి కూడా విడాకులు ఇచ్చేసాడు సిద్దార్థ్.కానీ చివరికి ఏమైందో ఏమో తెలియదు కానీ, వీళ్లిద్దరి పెళ్లి పెటాకులు అయ్యింది.ఆ తర్వాత సమంత నాగ చైతన్య ని పెళ్లి చేసుకుంది, కొన్నాళ్ళకు విడిపోయి ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయింది.కానీ సిద్దార్థ్ మాత్రం అదితి రావు హయాద్రి తో ప్రేమలో పడ్డాడు.మరి వీళ్లిద్దరి ప్రేమ వెళ్లి వరకు వెళ్తుందో లేదో చూడాలి.