Shruti Haasan: హీరోయిన్ శృతి హాసన్ మూడు భారీ ప్రాజెక్ట్స్ లో భాగమయ్యారు. కమ్ బ్యాక్ తర్వాత ఆమె కెరీర్ మెల్లగా పుంజుకుంది. 2017 అనంతరం ఆమె భారీ గ్యాప్ తీసుకున్నారు. ఈ సమయంలో శృతి పీకల్లోతు ప్రేమలో పడి కెరీర్ గాలికి వదిలేసింది. లండన్ కి చెందిన మైఖేల్ కోర్స్లే ని ప్రేమించిన శృతి అతనితో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. ఇక శృతి ఇతర హీరోయిన్స్ మాదిరి చాటు మాటుగా ఇలాంటి వ్యవహారాలు నడపదు. ఏదైనా నేరుగా అందరికి తెలిసేలా చేస్తుంది. మైఖేల్ తో ఆమె రిలేషన్ అలానే నడిచింది. సడన్ గా 2019లో ఈ జంట బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ పరిణామం ఆమెను డిప్రెషన్ లోకి నెట్టింది. ఆ టైం లో లండన్ లో లైవ్ మ్యూజిక్ షోలు ఇచ్చారు శృతి.

రెండేళ్ల పాటు ఆమె నటించిన ఒక్క చిత్రం విడుదల కాలేదు. ప్రేమ బాధ నుండి తేరుకొని మరలా సినిమాలకు సైన్ చేసింది. 2021 మళ్ళీ ఆమెకు బ్రేక్ వచ్చింది. రవితేజకు జంటగా నటించిన క్రాక్ సూపర్ హిట్ కొట్టింది. అలాగే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీలో హీరోయిన్ గా తక్కువ నిడివి గల పాత్ర చేశారు. క్రాక్, వకీల్ సాబ్ హిట్ టాక్ సొంతం చేసుకోగా ఆమెకు టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్స్ దక్కాయి. దర్శకులు బాబీ… వాల్తేరు వీరయ్య లో, గోపీచంద్ మలినేని వీరసింహారెడ్డి చిత్రాలకు ఆమెను ఎంపిక చేశారు. ఈ రెండు సంక్రాంతి కానుకగా విడుదలవుతున్నాయి.
ఈ రెండింటికి మించి సలార్ లో శృతి నటించడం గొప్ప పరిణామం. కెజిఎఫ్ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ పై ఇండియా వైడ్ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీతో ప్రభాస్ ఇండియన్ బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు. సలార్ హీరోయిన్ గా ఉన్న శృతికి ఆ మూవీ విజయం కీలకం కానుంది. ఆమె కెరీర్ కి మరో ఐదేళ్లు ఢోకా లేకుండా పోతుంది. వీటితో పాటు శృతి ఒక ఇంగ్లీష్ మూవీ కి సైన్ చేశారు.

వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాల విడుదల నేపథ్యంలో శృతి హాసన్ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కెరీర్ బిగినింగ్ లో శృతి హైట్ పై నెగిటివ్ కామెంట్స్ వినిపించాయట. కొందరు ఆమె హైట్ ని లోపంగా, ఒక మైనస్ గా కామెంట్స్ చేశారట. అయితే తన హైట్ మైనస్ కాదు, ఆమెకు ప్లస్ అయ్యిందని శృతి వెల్లడించారు. మహేష్, ప్రభాస్ వంటి పొడవాటి హీరోలతో జతకట్టేందుకు అది ఉపయోగపడింది అన్నారు. తనలో కూడా లోపాలు ఉన్నాయని, వాటిని తాను అధిగమిస్తూ వచ్చానంటూ శృతి విశ్వాసం ప్రకటించారు.