Shraddha Walker Murder Case: మొన్న ఢిల్లీలో జరిగిన శ్రద్ధ వాకర్ హత్య తెలుసు కదా! దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆమె ప్రియుడు అప్తాబ్ శ్రద్ధను 35 ముక్కలుగా కోసి అతి కిరాతకంగా చంపాడు. బయటకు చెప్పట్లేదు గాని పోలీసుల దర్యాప్తులో అతడు ఒక సె** అడిక్టర్ అని తేలింది. అయితే ఇలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని వైద్యులు చెప్తున్నారు. వీరి మనస్తత్వం పశు ప్రవృత్తిని పోలి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి శృంగారం అనేది సమాజం నుంచి వేరు చేసి దూరం పెట్టాల్సిన బూతు విషయం కాదు.. మనిషి జీవితంలో ఆకలి, నిద్ర, దాహం అనేవి ఎలాగో.. శృంగారం కూడా ఒక భావనే. అది లేకపోతే మానవజాతి ఇంత అభివృద్ధి సాధించేది కాదు.. అయితే ఇప్పటి పరిస్థితుల్లో కూడా శృంగారం అనే విషయాన్ని అంటరాని సబ్జెక్టుగానే చూస్తున్నారు.. అయితే శృంగార కోరికలు మితిమీరితే మనిషికి సమస్యలు తప్పవు.

ఇలా జరుగుతుంది
మనిషి మెదడు ఏ పని నుంచైనా ఒక భావప్రాప్తి లేదా ప్లెజర్ కోరుకుంటుంది. అది మంచి పని అయినా, చెడు పని అయినా దానికంటూ ఒక సంతృప్తి కావాలి. మెదడుకు మీరు చేసే ఏ పని తోనూ సంబంధం ఉండదు. కానీ చివరి ఫలితం వల్ల అది ఎలా అనుభూతి చెందింది అనేది ముఖ్యం. ఒక పని మనం పూర్తి చేసిన తర్వాత మెదడులో న్యూరో ట్రాన్స్ మిటెడ్ కెమికల్స్ అయిన సెరోటోనిన్, డోపనిన్ విడుదల అవుతాయి. అలా విడుదలవడం వల్ల మెదడుకు ఒక భావ ప్రాప్తి లభిస్తుంది. అలాంటి బావ ప్రాప్తి పొందినప్పుడు ఆ తరహా పనులను మెదడు ఇంకా ప్రోత్సహించే అవకాశం కూడా లేకపోలేదని వైద్యులు చెబుతున్నారు.. అయితే దేనికైనా ఒక లిమిట్ ఉండాల్సిందే. నా పొట్టలో ఎంత పడుతుందో అంతే తింటాం.. అలాగని మొత్తం తినాలి అనుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది.
ఒక లిమిట్ ఉండాల్సిందే
అలాగే శృంగారానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది.. రోజులో ఇన్నిసార్లు మాత్రమే చేయాలి అని ఒక లిమిట్ పెట్టుకోవాలి.. ఆ పరిధి మించితే ఇబ్బందులు తప్పవు.. మెదడులో సెరోటనిన్, డోపనిన్ ఎక్కువ విడుదలయితే మన మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వాటిలో ఓసీడీ, యాంగ్జైటి, గాబారా పడటం వంటివి ఎక్కువగా ఉంటాయి. ఇంకొందరికి జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, ఆలోచన సామర్థ్యం సన్నగిల్లడం వంటివి జరుగుతాయి.. ఇక ఈ శృంగార భావన అనేది స్థాయి నుంచి పోతే చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది.

ఇలా గుర్తించాలి
శృంగార కోరికలకు బాగా అడిక్ట్ అయిపోయిన వారికి ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. వీళ్ళు త్వరగా మనుషులతో కలవరు. ఒక్కరే ఉండేందుకు ఇష్టపడతారు.. మనుషులతో నేరుగా చూసి మాట్లాడలేరు. ఎక్కువకాలం ఫోన్లోనే గడిపేస్తుంటారు. వీరు బంధాన్ని సరిగ్గా నడపలేరు. దేని మీద ఆసక్తి, ఏకాగ్రత ఉండదు.. ఎప్పుడు కూడా ఏదో లోకంలో ఉన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు.. వారితో కాసేపు మాట్లాడితే ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు.. ఇలాంటి లక్షణాలు కనిపించిన వ్యక్తులను వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లడం మంచిది.. ఈ తరహా వ్యక్తులను ఏమైనా అంటే తీవ్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు.. శ్రద్ధ, అప్తాబ్ విషయంలో కూడా ఇదే జరిగింది.. ఆమెను శారీరకంగా వాడుకున్న తర్వాత వదిలేయాలి అనుకున్నాడు. ఈలోపు ఇంకో అమ్మాయి పరిచయం కావడంతో ఆమెతో శృంగార జీవితాన్ని ప్రారంభించాడు. దీంతో శ్రద్ధను వదిలించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేశాడు. ఆమెను శారీరకంగా కూడా ఇబ్బంది పెట్టాడు. చివరికి ఆమె ప్రాణం తీశాడు.
తల్లిదండ్రులు ఇలా చేయాలి
ఇప్పటికీ మన సమాజంలో శృంగారం అనేది ఒక బూతు గానే ఉంది. ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలతో తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉండాలి. ఏది మంచి, ఏది చెడు అని చెప్తూ ఉండాలి. అలాగే కొందరికి పెళ్లయి పిల్లలు ఉన్నప్పటికీ కూడా శృంగార జీవితం మీద అవగాహన ఉండదు. అలాంటి వారికి వారి జీవిత భాగస్వామి కాస్త అర్థం అయ్యేలా చెప్పాలి.. సె** అడిక్షన్ బాధితులతో ఎవరు మాట్లాడకపోయేసరికి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు.. అలాంటి వారికి ముందుగా కౌన్సిలింగ్ ఇప్పించాలి. మందులు వాడుతుంటే పరిస్థితి చక్కబడుతుంది.