కరోనా నుంచి కోలుకున్న వారికి మరో షాకింగ్ న్యూస్..?

భారత్ లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా వైరస్ ఉధృతికి అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. అయితే కరోనా బారిన పడ్డ వారిలో 85 శాతం మంది హోం క్వారంటైన్ లోనే కోలుకుంటున్నారు. మిగిలిన 15 శాతం మందికి ఆస్పత్రిలో చికిత్స అవసరమవుతోంది. అయితే తాజాగా శాస్త్రవేత్తలు కరోనా వైరస్ గురించి మరో కీలక విషయాన్ని వెల్లడించారు. Also Read: షాకింగ్.. మూడేళ్ల క్రితమే ట్రంప్ కుక్కచావు చావాలని శాపం..? కరోనా […]

Written By: Kusuma Aggunna, Updated On : October 5, 2020 5:20 pm
Follow us on


భారత్ లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా వైరస్ ఉధృతికి అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. అయితే కరోనా బారిన పడ్డ వారిలో 85 శాతం మంది హోం క్వారంటైన్ లోనే కోలుకుంటున్నారు. మిగిలిన 15 శాతం మందికి ఆస్పత్రిలో చికిత్స అవసరమవుతోంది. అయితే తాజాగా శాస్త్రవేత్తలు కరోనా వైరస్ గురించి మరో కీలక విషయాన్ని వెల్లడించారు.

Also Read: షాకింగ్.. మూడేళ్ల క్రితమే ట్రంప్ కుక్కచావు చావాలని శాపం..?

కరోనా నుంచి కోలుకున్న వారిలో చాలామందిని సాధారణ సమస్యలు వేధిస్తున్నాయని.. చాలా మంది కరోనా బాధితులు ఫైబ్రోసిస్(ఊపిరితిత్తుల్లో గట్టిదనం) సమస్యతో బాధ పడుతున్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీర్ఘకాలం ఆక్సిజన్ అవసరమైన వారికి ఎక్కువగా ఈ సమస్య వేధిస్తున్నట్టు గుర్తించామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత ఎలాంటి ఆరోగ్య సమస్యలు కనిపించినా వెంటనే వైద్యున్ని సంప్రదించి చికిత్స తీసుకుంటే మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కరోనా నుంచి కోలుకున్న వారిలో ప్రధానంగా తలనొప్పి, దగ్గు, నీరసం, ఆకలి లేకపోవడం, ఒళ్లునొప్పులు, 99 డిగ్రీల జ్వరం లాంటి సమస్యలు కనిపిస్తున్నాయి. మరి కొందరిలో మాత్రం షుగర్ లెవెల్స్ పెరగడం, ఆయాసం, గుండె ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు, గుండె దడ, ఛాతీలో పట్టేసినట్లుగా ఉండటం లాంటి సమస్యలు కనిపిస్తున్నాయి. అయితే కోలుకున్న వారిలో కొందరిలోనే ఈ సమస్యలు కనిపిస్తున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Also Read: డప్పుల శబ్దం విని లేచిన శవం.. చివరకు?

5 నుంచి 10 శాతం మంది కోలుకున్న కరోనా రోగులు ఈ సమస్యలతో బాధ పడుతున్నట్టు తాము గుర్తించామని.. 1 నుంచి 2 శాతం మంది ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించకూడదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.