
Mahesh Babu – Pawan Kalyan : టాలీవుడ్ లో ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ జోరు ఊపందుకుంది.నిన్న గాక మొన్న సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక మూవీ రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకొని శరవేగంగా షూటింగ్ ని పూర్తి చేసుకుంటుంది.మరో పక్క పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ షూటింగ్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగిపోతుంది.నిన్ననే ఈ సినిమాకి సంబంధించిన లుక్ టెస్ట్స్ షూట్ ని నిర్వహించారు.
ఇక ఈ సినిమాకి సంబంధించిన ఇంటి సెట్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ ఖర్చు తో నిర్మించారు.మరోపక్క కొద్దీ రోజుల క్రితమే మహేష్ – త్రివిక్రమ్ మూవీ కోసం కూడా ఇలాంటి ఇంటి సెట్ ని నిర్మించారు.ఈ రెండు సెట్స్ అన్నపూర్ణ స్టూడియోస్ లో నడిచేంత దూరం లోనే ఉన్నట్టు తెలుస్తుంది.మహేష్ – త్రివిక్రమ్ మూవీ సెట్స్ లో ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ నడుస్తుంది.
మహేష్ బాబు తో పాటుగా శ్రీలీల, పూజ హెగ్డే మరియు ఇతర తారాగణం ఈ ఇంటి సెట్స్ లో గత నెల రోజుల నుండి షూటింగ్ లో పాల్గొంటున్నారు.మరో పక్క ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇంటి సెట్ లో కూడా వచ్చే నెల 5 వ తారీఖు నుండి విరామం లేకుండా షూటింగ్ జరగనుంది.ఇలా ఇద్దరు స్టార్ హీరోలకు సంబంధించిన షూటింగ్స్ ఇంటి సెట్స్ లోనే జరుగుతుండడం, అది కూడా ఒకే ప్రాంతం లో జరగడం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది.అయితే రెండు షూటింగ్స్ ఒకే ప్రాంతం లో జరుగుతున్నా నేపథ్యం లో పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు ఒకసారైనా కలిసే అవకాశం ఉంటే బాగుంటుంది అని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ విషయానికి వస్తే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి నేతృత్వం లో ఇప్పటికే ఇంటి సెట్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లో వెయ్యగా, రామోజీ ఫిలిం సిటీ లో కాలేజీ సెట్ ని నిర్మించనున్నారు.ఈ సెట్ ని నిర్మించడానికి సుమారుగా 40 రోజుల సమయం పడుతుందట.ఈ మూవీ షూటింగ్ కోసం మొత్తానికి పవన్ కళ్యాణ్ 100 రోజుల డేట్స్ ని కేటాయించినట్టు తెలుస్తుంది.