Dolly Master Chai
Viral Video : అలా తెచ్చిన చాయ్ ని రెండు గాజు గ్లాసుల్లో పోసాడు. వాటిని ఇద్దరు వ్యక్తులకు ఇచ్చాడు. వారు లొట్టలు వేసుకుంటూ దానిని తాగారు. ఆ తర్వాత అతడిని గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. అలా చాయ్ తయారు చేసిన వ్యక్తి పేరు డాలి మాస్టర్ (Dolly chai master).. చాయ్ తాగిన వారిలో ఒక వ్యక్తి పేరు షోయబ్ అఖ్తర్( Shoaib Akhtar) . ఇటీవల ఓ క్రికెట్ టోర్నీ జరిగింది. ఆ టోర్నిలో వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి షోయబ్ అఖ్తర్ వచ్చాడు. అతడికి తన చేతుల మీదుగా తయారుచేసిన చాయ్ అందివ్వడానికి డాలి మాస్టర్ ప్రత్యేకంగా వచ్చాడు. చాయ్ తయారుచేసి షోయబ్ అఖ్తర్ కు పోసాడు. అది తాగిన షోయబ్.. మై మరిచిపోయాడు. వెంటనే మరో గ్లాస్ కూడా తాగాడు. మొత్తంగా ఈ చాయ్ అద్భుతంగా ఉందని.. తన నోటికి సరికొత్త రుచిని అందించిందని వ్యాఖ్యానించాడు. “నాగ్ పూర్ ప్రాంతానికి చెందిన డాలి తన చాయ్ తో నన్ను మై మరపింప చేశాడని” పేర్కొన్నాడు.
బిల్ గేట్స్ కూడా..
వినూత్నంగా, విచిత్రంగా చాయ్ తయారుచేసి అమ్మే డాలీ మాస్టర్ గురించి గతంలో ఎవరికీ పెద్దగా తెలియదు. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని అతడి గురించి ప్రపంచానికి తెలిసింది. దీంతో అతడు ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయాడు.. ప్రస్తుతం సెలబ్రిటీ హోదాను అనుభవిస్తున్నాడు. గత ఏడాది ముంబైలో ముఖేష్ అంబానీ రెండవ కుమారుడు అనంత్ అంబానీ వివాహం జరిగింది. ఆ వివాహ వేడుకకు బిల్ గేట్స్ హాజరయ్యారు. ఆ వేడుకకు హాజరయ్యే కంటే ముందు డాలి మాస్టర్ ను కలిశారు. అతడు చేసిన చాయ్ తాగారు. చాయ్ అద్భుతంగా ఉందని వ్యాఖ్యానించారు. అతనితో కలిసి మాట్లాడటం గొప్పగా ఉందని పేర్కొన్నారు. డాలీ మాస్టర్ తో కలిసి దిగిన ఫోటోలను తన సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్ట్ చేసుకున్నారు. డాలీ మాస్టర్ చాయ్ తయారుచేసి.. షోయబ్ అఖ్తర్, ఇతర వ్యక్తులకు పోయడానికి స్టార్ స్పోర్ట్స్ గ్రూప్ భారీగానే ఇచ్చినట్టు తెలుస్తోంది. కాగా, చాయ్ తయారుచేసి అమ్మే వ్యక్తి ఈ స్థాయిలో సెలబ్రిటీ హోదాను అనుభవించడం మాత్రం నిజంగా గ్రేట్ అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. కష్టపడి ఈ స్థాయికి వచ్చిన డాలి అందరికీ ఆదర్శమని కొనియాడుతున్నారు. డాలీ చాయ్ తయారుచేసి సెలబ్రిటీ కావడంతో నెటిజన్లు కూడా అతడి పై ప్రశంసల జల్లు కురుస్తోంది.