Srihan- Siri: బిగ్ బాస్ ప్రేమికులకు సిరి-శ్రీహాన్ పరిచయం అక్కర్లేని పేర్లు. ఈ ఫేమస్ యూట్యూబర్స్ తమని తాము ప్రేమికులుగా ప్రకటించుకున్నారు. సిరి బిగ్ బాస్ హౌస్లో ఉండగా శ్రీహాన్ వేదికపైకి వచ్చాడు. ఇక ప్రస్తుతం శ్రీహాన్ బిగ్ బాస్ షోలో ఉన్నాడు. ఫ్యామిలీ వీక్ లో సిరి అతని కోసం హౌస్లోకి వెళ్ళింది. ఎలాగైనా టైటిల్ గెలవాలని స్ఫూర్తి నింపింది. సిరి తాజాగా అరియనా హోస్ట్ చేసిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా…. మీకు శ్రీహాన్ కి మధ్య మనస్పర్థలు వచ్చాయట. విడిపోవాలని అనుకున్నారట కదా? అని అరియనా అడిగింది.

ఈ వార్తలపై సిరి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. బహుశా నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఈ ప్రచారం జరిగి ఉండవచ్చు. నా జ్ఞాపకాలు శ్రీహాన్ చెరిపేసి ఉంటే ఇప్పుడు మేము ఇలా కలిసి ఉండేవాళ్ళం కాదు కదా… అని సిరి వివరణ ఇచ్చారు. మీ మధ్య అసలు గొడవలే జరగలేదా? అని అరియనా మరో ప్రశ్న వేయగా… సిరి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. ఓ విషయంలో మా మధ్య విభేదాలు తలెత్తాయి. అప్పుడు చాలా జరిగాయని ముగించే ప్రయత్నం చేసింది.
అయితే అరియనా వాటిలో కొన్నైనా చెప్పాలని పట్టుబట్టడంతో సిరి బయటపెట్టారు. బిగ్ బాస్ సీజన్ 5 తర్వాత మా వ్యక్తిగత జీవితాల్లో చాలా జరిగాయి. అవి మీరు ఊహించలేరు కూడాను. వ్యవహారం బ్రేకప్ వరకూ వెళ్ళింది. నేను లేకుండా శ్రీహాన్ ఒంటరిగా ఒక ట్రిప్ కి వెళ్ళాడు. అప్పుడు నేను కోవిడ్ తో బాధపడుతున్నాను. శ్రీహాన్ అలా చేయడంతో నేను నిరాశకు గురయ్యాను. ఏదో ఒకటి చేసుకుందామనే ఆలోచనలు వచ్చాయి.

లేదంటే కుటుంబ సభ్యులకు తెలియకుండా దూరంగా ఎక్కడికైనా వెళ్లిపోదాం అనుకున్నాను. ఉదయాన్నే లేచి చెప్పులు లేకుండా మణికొండ రోడ్లపై పిచ్చిదానిలా తిరిగాను. ఇలాంటివి చాలానే చేశాను. శ్రీహాన్ ఇంటికి వచ్చి నన్ను కన్విన్స్ చేశాడు. మళ్ళీ ఇద్దరం దగ్గరయ్యాం. ఇప్పుడు మా మధ్య బలమైన బంధం ఉందని సిరి చెప్పుకొచ్చారు. కాగా సిరి బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్నారు. కంటెస్టెంట్ షణ్ముఖ్ తో ఫ్రెండ్ అంటూ సిరి రొమాన్స్ చేసింది. వీరి లవ్ డ్రామా చూసిన షణ్ముఖ్ లవర్ దీప్తి సునైన బ్రేకప్ చెప్పింది. షణ్ముఖ్ కారణంగా సిరికి శ్రీహాన్ బ్రేకప్ చెప్పాడనే పుకార్లు తెరపైకి వచ్చాయి.