Shah Rukh Khan: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ అరుదైన ఫీట్ సాధించారు. ఆయన వరల్డ్ ఆల్ టైం గ్రేటెస్ట్ 50 యాక్టర్స్ లిస్ట్ లో స్థానం సంపాదించారు. ఈ గౌరవం పొందిన ఏకైన ఇండియన్ రికార్డులకు ఎక్కారు. ఈ అంతర్జాతీయ గుర్తింపుకు షారుక్ అర్హత సంపాదించడం విశేషత సంతరించుకుంది. ప్రఖ్యాత ఎంపైర్ మ్యాగజైన్ ప్రపంచ గ్రేటెస్ట్ యాక్టర్స్ లిస్ట్ ప్రకటించింది. ఈ లిస్ట్ లో మార్లన్ బ్రాండో, టామ్ హాంక్స్, లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్లెట్ వంటి గొప్ప నటులకు చోటు దక్కింది. వారి సరసన షారుక్ ఖాన్ చేరారు.

1992లో విడుదలైన దివానా చిత్రంతో షారుక్ వెండితెరకు పరిచయమయ్యారు. మూడు దశాబ్దాల కెరీర్లో షారుక్ అనేక అద్భుతమైన విజయాలు బాలీవుడ్ కి అందించారు. బాలీవుడ్ టాప్ హీరోగా అవతరించారు. షారుక్ నటించిన దిల్ వాలే దుల్హానియా లేజాయింగే, దేవదాస్, మై నేమ్ ఈజ్ ఖాన్, చెక్ దే ఇండియా. బాజీగర్ వంటి చిత్రాలు ఆయనకు ఎక్కడలేని ఇమేజ్ తెచ్చిపెట్టాయి. అశేష అభిమాన గణాన్ని సంపాదించి పెట్టాయి.
ప్రస్తుతం షారుక్ కెరీర్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. చెన్నై ఎక్స్ ప్రెస్ తర్వాత షారుక్ కి హిట్ పడలేదు. ఆయన సక్సెస్ రుచి చూసి పదేళ్లు కావస్తుంది. హిట్ ట్రాక్ ఎక్కేందుకు ఆయన అనేక ప్రయోగాలు చేశారు. ఒక్కటి కూడా ఫలితం ఇవ్వలేదు. ఈ క్రమంలో షారుక్ దాదాపు మూడేళ్లు బ్రేక్ కూడా తీసుకున్నారు. అనంతరం కసితో వరుస చిత్రాలు ప్రకటించారు. షారుక్-దీపికా పదుకొనే జంటగా నటించిన పఠాన్ జనవరి 25న విడుదల కానుంది.

సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన పఠాన్ వివాదాల్లో చిక్కుకుంది. ఈ చిత్రంలోని ఒక సాంగ్ లో దీపికా కాషాయ రంగు బికినీ ధరించారు. దీన్ని బీజేపీ వర్గాలు తప్పుబట్టాయి. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాయి. హేతువాదులు అవన్నీ చెత్త ఆరోపణలుగా కొట్టిపారేస్తున్నారు. షారుక్ సౌత్ ఇండియా దర్శకుడు అట్లీ తో జవాన్ టైటిల్ తో మరో మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు.