shah rukh khan : లతా మంగేష్కర్ భౌతికకాయంపై షారుఖ్ ఖాన్ ఉమ్మేశాడంటూ విమర్శలు.. అసలు నిజం ఏంటంటే?

shah rukh khan : గానకోకిల లతా మంగేష్కర్ గొంతు మూగబోయిన సంగతి తెలిసిందే.. అనారోగ్య కారణాలతో ఆమె ఇటీవల చనిపోగా.. నిన్న సాయంత్రం ముంబైలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆమె భౌతిక ఖాయాన్ని సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు దర్శించారు.. ప్రధాని మోడీ నుంచి మొదలు కొని బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ వరకూ ఆమెకు నివాళులర్పించారు. అయితే నివాళి అర్పించే సమయంలో షారుఖ్ ఖాన్ చేసిన ఒక పని విమర్శలపాలైంది. తన మేనేజర్ పూజా […]

Written By: NARESH, Updated On : February 7, 2022 7:58 pm
Follow us on

shah rukh khan : గానకోకిల లతా మంగేష్కర్ గొంతు మూగబోయిన సంగతి తెలిసిందే.. అనారోగ్య కారణాలతో ఆమె ఇటీవల చనిపోగా.. నిన్న సాయంత్రం ముంబైలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆమె భౌతిక ఖాయాన్ని సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు దర్శించారు.. ప్రధాని మోడీ నుంచి మొదలు కొని బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ వరకూ ఆమెకు నివాళులర్పించారు.

అయితే నివాళి అర్పించే సమయంలో షారుఖ్ ఖాన్ చేసిన ఒక పని విమర్శలపాలైంది. తన మేనేజర్ పూజా దద్లానీతో కలిసి షారుఖ్ ఖాన్ చేసిన ఒక పని విమర్శల పాలైంది. పూజ చేతులు జోడించి నివాళి అర్పించగా.. షారుఖ్ ముస్లిం సంప్రదాయం ప్రకారం దువా చేశారు. ఈ సందర్భంగా లత మంగేష్కర్ పాదాల వద్ద షారుఖ్ ఉమ్మేశాడంటూ సోషల్ మీడియాలో బీజేపీ హర్యానా ఐటీ సెల్ ఇన్ చార్జి అరుణ్ యాదవ్ తోపాటు నెటిజన్లు వీడియోను వైరల్ చేశారు. ‘ఈయన ఉమ్ముతున్నారా?’ అని కామెంట్ పెట్టారు. అయితే ఇక్కడే విమర్శకులు ముస్లిం సంప్రదాయాన్ని మరిచిపోయారు.

ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఇది సాధారణ ఆచారం. ఎవరైనా చనిపోయినప్పుడు లేదా ఏదైనా సందర్భాల్లో దువా చదివి గాలి ఊదుతారు. దువా చదివేవారు ముస్లిం పవిత్ర గ్రంథమైన ఖురాన్ షరీఫ్ పంక్తులను చదువుతారు. వారి ఆత్మశాంతి కోసం ప్రార్థిస్తారు. దువా చదివిన తర్వాత మృతుల దేహంపై గాలి ఊదుతారు.

ఇలా చేస్తే ఆత్మ సురక్షితంగా ఉండే మరో జన్మలో కూడా ఆమెకు దేవుడు ఆశీస్సులు అందిస్తాడని ముస్లింల నమ్మకం.. లతా మంగేష్కర్ కు నివాళి సమయంలో షారుఖ్ ఖాన్ ఇదే చేశాడు.

అయితే దీన్ని అర్థం చేసుకోలేక బీజేపీ హర్యానా ఐటీసెల్ ఇన్ చార్జి అరుణ్ సహా చాలా మంది నెటిజన్లు షారుఖ్ ఖాన్ పై సోషల్ మీడియాలో పెద్ద వివాదం రాజేసి ట్రోల్ చేస్తున్నారు. ఇక ఎందరో మంది షారుఖ్ కు మద్దతుగా ట్వీట్లు చేస్తూ సపోర్ట్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.