
RGV On Chandrababu: సాధారణంగా ఎంతటి శత్రువు అయినా సరే పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతాం. అది మనిషి నైజం. కానీ రాంగోపాల్ వర్మ అసలే తిక్క క్యారెక్టర్ కాబట్టి.. పుట్టినరోజు నాడు కూడా రివెంజ్ తెచ్చుకున్నాడు. అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు మీద. ఇవాళ చంద్రబాబు నాయుడు పుట్టినరోజు. విజయ సాయి రెడ్డి నుంచి మొదలుపెడితే ఎన్ టివి నరేంద్ర చౌదరి వరకు అందరూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ట్విట్టర్లో అయితే హ్యాపీ బర్త్డే టూ యు చంద్రబాబు నాయుడు యాష్ ట్యాగ్ టాప్ త్రీ లో కొనసాగుతోంది. అలాంటి వేళ రాంగోపాల్ వర్మ చంద్రబాబు నాయుడు మీద తన కసిని ప్రదర్శిస్తున్నాడు. పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చంద్రబాబు నాయుడు నీచుడు, దుర్మార్గుడు అని అర్థం వచ్చేలా ఫోటోలు షేర్ చేస్తున్నాడు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో చంద్రబాబు నాయుడు ఫోటోలను వివిధ రూపాల్లో డిజైన్ చేసి తన దుగ్దను తీర్చుకుంటున్నాడు. అంతే కాదు “సీబీఎన్ సీకో” అనే పేరుతో ఒక పాట కూడా రూపొందించాడు. బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు ఈ పాటను సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు.” ఈ పాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించాము. ఇందులో ఒక వాయిస్ నా గొంతును పోలి ఉంటుంది. కానీ అది మాత్రం నాది కాదు.. పంచభూతాల సాక్షిగా ఈ పాట ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ ద్వారా మాత్రమే రూపొందించాం” అని రామ్ గోపాల్ వర్మ రాసుకొచ్చాడు. అంతేకాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన చంద్రబాబు నాయుడు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
రాంగోపాల్ వర్మ చంద్రబాబు నాయుడు మీద ఇలా సెటైర్లు వేయడం ఇదే మొదటిసారి కాదు. 2019 ఎన్నికలకు ముందు “లక్ష్మీస్ ఎన్టీఆర్”, “అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు” అనే వివాదాస్పద సినిమాలు తీశాడు. అప్పట్లో ఎన్నికలకు ముందు బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ ఇస్తే.. దానికి పోటీగా “లక్ష్మీస్ ఎన్టీఆర్” అనే సినిమాను రాంగోపాల్ వర్మ తీశాడు. అయితే ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదలకుండా అప్పట్లో చంద్రబాబు చూసాడు. తర్వాత కోర్టుకు వెళ్లి రాంగోపాల్ వర్మ ఈ సినిమా విడుదల అయ్యేలాగా ఉత్తర్వులు తెచ్చుకున్నాడు. అప్పట్లో సినిమా సంచలనానికి నాంది పలికింది. సమయంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన యాత్ర సినిమా విజయవంతం కావడం విశేషం.

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు నాయుడు మీద మరింత రెచ్చిపోయాడు.. విలక్షణమైన పోస్టులు పెట్టి టిడిపి నాయకులను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. నారా లోకేష్ చేస్తున్న పాదయాత్రలో కొన్ని ఫోటోలను, గతంలో జగన్ పాదయాత్ర చేసిన ఫోటోలను పోల్చుతూ వీడియో రూపొందించాడు..” కాపీ పేస్ట్” అంటూ లోకేష్ ను గేలి చేశాడు. ప్రస్తుతం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా టిడిపి నాయకులను రెచ్చగొట్టే విధంగా పోస్టులు, ఫోటోలు పెట్టాడు. దీనిపై టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాంగోపాల్ వర్మ జగన్మోహన్ రెడ్డి కి అమ్ముడుపోయాడని, అందుకే ఇలాంటి చిల్లర పోస్టులు పెడుతున్నాడని ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎవరు ఏమన్నా అనుకోని.. తన దారి తనదే దాటు రాంగోపాల్ వర్మ చంద్రబాబు నాయుడు మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విమర్శల బాణాలు వదులుతున్నారు.
View this post on Instagram