https://oktelugu.com/

BiggBoss 6 Telugu Nominations: బిగ్ బాస్ 6: ఈ వారం నామినేషన్లలో ఏడుగురు.. అత్యధిక ఓట్లు సింగర్ రేవంత్ కే.. ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే? 

BiggBoss 6 Telugu Nominations:  బిగ్ బాస్ లో 3వ రోజు నామినేషన్ల రచ్చ మొదలైంది. షో ప్రారంభం కాగానే కాసేపు ముచ్చట్ల తర్వాత నామినేషన్ల ప్రక్రియను బిగ్ బాస్ మొదలుపెట్టారు. ఇక ఇప్పటికే క్లాస్ టీంలో ఉన్న గీతూ, ఆదిరెడ్డి, నేహా చౌదరిలు ఉండి నామినేషన్స్ తప్పించుకుంటూ కెప్టెన్సీ పోటీదారులుగా మారారు. ఈ వారం ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయ్యారు. ఇక ట్రాష్ లో ఉన్న బాలాదిత్య, ఇనాయా సుల్తానా, అభినయలు డైరెక్ట్ గా నామినేషన్స్ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 7, 2022 / 11:21 PM IST
    Follow us on

    BiggBoss 6 Telugu Nominations:  బిగ్ బాస్ లో 3వ రోజు నామినేషన్ల రచ్చ మొదలైంది. షో ప్రారంభం కాగానే కాసేపు ముచ్చట్ల తర్వాత నామినేషన్ల ప్రక్రియను బిగ్ బాస్ మొదలుపెట్టారు. ఇక ఇప్పటికే క్లాస్ టీంలో ఉన్న గీతూ, ఆదిరెడ్డి, నేహా చౌదరిలు ఉండి నామినేషన్స్ తప్పించుకుంటూ కెప్టెన్సీ పోటీదారులుగా మారారు. ఈ వారం ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయ్యారు. ఇక ట్రాష్ లో ఉన్న బాలాదిత్య, ఇనాయా సుల్తానా, అభినయలు డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి వచ్చారు.

    ఈ ఆరుగురిని తప్పించి బిగ్ బాస్ మిగతా వారిని నామినేట్ చేసుకోవాల్సిందిగా సూచించాడు. దీంతో బుధవారం నామినేషన్స్ ప్రక్రియలో ఒక్కో కంటెస్టెంట్ ఇద్దరినీ నామినేట్ చేయాలని ఆదేశించాడు. దీంతో ఇంటి సభ్యులంతా సీరియల్ గా నామినేట్ చేశారు.తొలుత సింగర్ రేవంత్ ఇద్దరినీ నామినేట్ చేశాడు.. ఫైమా, ఆరోహీలను ఇంటి నుంచి బయటకు పంపించడానికి నామినేట్ చేశాడు.

    -ఎవరెవరు ఎవరిని నామినేట్ చేశారంటే?

    రేవంత్ – ఫైమా, ఆరోహీలను నామినేట్ చేశాడు
    సుదీప- రేవంత్, చంటిలను..
    ఫైమా-రేవంత్, అర్జున్ లను
    వాసంతి- రేవంత్, శ్రీ సత్యలను
    అర్జున్ – ఫైమా, ఆరోహిలను
    కీర్తి- రేవంత్ , చంటి లను
    ఆరోహీ- రేవంత్, శ్రీసత్య లను
    రాజ్ – వాసంతి, చంటి లను
    కమెడియన్ షానీ – శ్రీసత్య, చంటి లను
    శ్రీసత్య – వాసంతి, రాజ్ లను
    మెరానీ జోడీ – ఫైమా, చంటి లను
    శ్రీహాన్ -రేవంత్, కీర్తిలను
    చంటి – రేవంత్, సుదీప లను
    సూర్య- రేవంత్, చంటిలను నామినేట్ చేశారు.

    ఇంటి సభ్యులందరి నామినేషన్స్ తర్వాత అత్యధికంగా ఓట్లు వచ్చిన రేవంత్, చంటి, ఫైమా, శ్రీసత్యలతోపాటు ఇంతకుముందు గేమ్ లో ఓడి ట్రాష్ లో ఉన్న ఇనాయా, బాలాదిత్య, అభినయశ్రీలు మొత్తం ఏడుగురు నామినేషన్స్ లో ఉన్నట్టు బిగ్ బాస్ ప్రకటించాడు.

    ఇక నామినేషన్స్ సందర్భంగా సింగర్ రేవంత్ ప్రవర్తనను అందరూ తప్పుపట్టారు. తనను అవమానించేలా మాట్లాడాడని ఫైమా ఆరోపించింది. ఇక తన మేకప్ గురించి కించపరిచాడని కీర్తి ఆవేదన చెందింది. సూర్య, శ్రీహాన్ లు కూడా రేవంత్ తీరు బాగాలేదని.. ఆటిట్యూడ్ మార్చుకోవాలని హితవు పలికారు..

    ఇక చలాకీ చంటి నామినేషన్స్ చేస్తూ ఇచ్చిన వివరణకు ఇంటి సభ్యులంతా చప్పట్లతో ప్రశంసించారు.. చంటి నామినేషన్ చేసి వారిని ఎందుకు చేస్తున్నానో చెప్పిన విధానం అందరినీ ఆకట్టుకుంది. చంటి ఎంతో పరిణతితో ఎవరిని నొప్పించకుండా.. నొప్పించుకోకుండా మాట్లాడిన విధానం ఆకట్టుకుంది. అందుకే చంటిని ఇంటి సభ్యులంతా అభినందించారు.

    ఇక బిగ్ బాస్ చివర్లో ట్విస్ట్ ఇచ్చాడు. స్వాప్ అనే ఆప్షన్ ఇచ్చి నామినేట్ అయిన ఒకరిని రక్షించవచ్చని.. సేఫ్ అయిన వారిని నామినేషన్ లోకి పంపించవచ్చని ‘క్లాస్’ టీంలో ఉన్న నేహా, ఆదిరెడ్డి, గీతూలకు ఆప్షన్ ఇచ్చాడు. వారందరూ ఆలోచించి.. నామినేట్ అయిన బాలాదిత్యను సేవ్ చేశారు. అతడి ప్లేసులో ‘ఆరోహి’ని నామినేషన్ లోకి పంపించారు. దీంతో సేవ్ అయిపోయిన ఆరోహి నామినేట్ కాగా.. నామినేట్ అయిన బాలాదిత్య లక్కీగా సేవ్ అయిపోయాడు.

    మొత్తంగా నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యేసరికి తొలి వారం నామినేషన్స్ లో రేవంత్, చంటి, శ్రీసత్య, ఫైమా, ఇనాయా, అభినయశ్రీ, ఆరోహి లు ఉన్నారు. ఈ ఏడుగురిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కావడం గ్యారెంటీ. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది వేచిచూడాలి. ప్రవర్తన పరంగా చూస్తే ఇనాయా ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.