https://oktelugu.com/

Rashmika Mandanna : ఆయనంటే నాకిష్టం అన్నీ తెలిసే చేశాను… రష్మిక మందాన సెన్సేషనల్ కామెంట్స్

Rashmika Mandanna : 2023లో రష్మిక మందానకు ఒక ప్లాప్ ఒక హిట్ పడింది. బాలీవుడ్ మూవీ మిషన్ మజ్ను నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. హీరో సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన స్పై థ్రిల్లర్ నెట్ఫ్లిక్స్ లో నేరుగా విడుదల చేస్తారు. కొత్తదనం లేని కథ, బలహీనమైన కథనం మెప్పించలేకపోయాయని క్రిటిక్స్, ఆడియన్స్ అభిప్రాయం. అయితే విజయ్ కి జంటగా నటించిన వారిసు హిట్ టాక్ తెచ్చుకుంది. మూవీ యావరేజ్ గా ఉన్నప్పటికీ విజయ్ మేనియాతో విజయ తీరాలకు […]

Written By:
  • NARESH
  • , Updated On : January 22, 2023 / 03:23 PM IST
    Follow us on

    Rashmika Mandanna : 2023లో రష్మిక మందానకు ఒక ప్లాప్ ఒక హిట్ పడింది. బాలీవుడ్ మూవీ మిషన్ మజ్ను నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. హీరో సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన స్పై థ్రిల్లర్ నెట్ఫ్లిక్స్ లో నేరుగా విడుదల చేస్తారు. కొత్తదనం లేని కథ, బలహీనమైన కథనం మెప్పించలేకపోయాయని క్రిటిక్స్, ఆడియన్స్ అభిప్రాయం. అయితే విజయ్ కి జంటగా నటించిన వారిసు హిట్ టాక్ తెచ్చుకుంది. మూవీ యావరేజ్ గా ఉన్నప్పటికీ విజయ్ మేనియాతో విజయ తీరాలకు చేరింది. రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

    అయితే ఈ మూవీలో రష్మిక పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యత లేదు. కేవలం పాటల కోసమే ఆమెను తీసుకున్నారనిపించింది. ఈ క్రమంలో ఆమెపై ట్రోల్స్ ఎక్కువయ్యాయి. ఈ విమర్శలపై రష్మిక స్పందించారు. అవును నా పాత్రకు ఇంపార్టెన్స్ లేదని తెలిసే చిత్రం చేశాను. మీకు వచ్చిన ఇబ్బందేంటని ఎదురు ప్రశ్నిస్తున్నారు. విజయ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన మూవీలో ఛాన్స్ వదులుకోవడం ఇష్టం లేక నటించాను. వారిసు మూవీ సెట్స్ లో ఈ విషయాన్ని సరదాగా విజయ్ తో చెప్పేదాన్ని కూడాను. నా పాత్ర కేవలం పాటలకే పరిమితమని విజయ్ తో అనేదాన్ని… అని వివరణ ఇచ్చారు.

    కేవలం హీరో విజయ్ కోసం వారిసు చిత్రంలో నటించాను. నా పాత్రకు విషయం లేదని ముందే తెలుసంటూ… ఉన్న విషయం బయటపెట్టింది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు బడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రన్బీర్ కపూర్ కి జంటగా యానిమల్ చిత్రం చేస్తున్నారు. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి తెరకెక్కిస్తున్న యానిమల్ చిత్రంపై పాజిటివ్ బజ్ నడుస్తుంది. యానిమల్ ఫస్ట్ లుక్ విడుదల చేయగా మంచి స్పందన దక్కింది.

    అలాగే అల్లు అర్జున్ కి జంటగా పుష్ప 2 చేస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం వైజాగ్ లో చిత్రీకరణ జరుగుతుంది. రెండు రోజుల క్రితం అల్లు అర్జున్ పుష్ప 2 షూట్ కోసం వైజాగ్ వచ్చారు. 2024లో పుష్ప 2 విడుదల కానుంది. పుష్ప 2 దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. స్టార్ క్యాస్ట్ ఈ ప్రాజెక్ట్ లో భాగం అవుతున్నారు. స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసి భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ పుష్ప 2 ని పార్ట్ 1 కి మించి గొప్పగా తీర్చిద్దిదాలని సీరియస్ గా పనిచేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పుష్ప 2 చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.