https://oktelugu.com/

Senior Heroine Jayaprada Arrested : సీనియర్ హీరోయిన్ జయప్రద అరెస్ట్..? నాన్ బైలాబుల్ వారెంట్ జారీ చేసిన హై కోర్టు

Senior heroine Jayaprada arrested..? : మొన్నటి తరం హీరోయిన్స్ లో అందం మరియు అభినయం అంటే గుర్తు వచ్చే ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరు జయప్రద..ఆరోజుల్లో ఈమెకి ఉన్న క్రేజ్ మామూలుది కాదు..అప్పటి కుర్రకారులను తన అందం మరియు అభినయం తో వెర్రెత్తిపోయేలా చేసింది..చిరంజీవి , కృష్ణ ,ఎన్టీఆర్ , ఏఎన్నార్ , శోభన్ బాబు ఇలా ఒక్కరా ఇద్దరా దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించి సుమారుగా మూడు దశాబ్దాల పాటు చిత్ర […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 22, 2022 / 09:33 PM IST
    Follow us on

    Senior heroine Jayaprada arrested..? : మొన్నటి తరం హీరోయిన్స్ లో అందం మరియు అభినయం అంటే గుర్తు వచ్చే ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరు జయప్రద..ఆరోజుల్లో ఈమెకి ఉన్న క్రేజ్ మామూలుది కాదు..అప్పటి కుర్రకారులను తన అందం మరియు అభినయం తో వెర్రెత్తిపోయేలా చేసింది..చిరంజీవి , కృష్ణ ,ఎన్టీఆర్ , ఏఎన్నార్ , శోభన్ బాబు ఇలా ఒక్కరా ఇద్దరా దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించి సుమారుగా మూడు దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలిగింది.

    ఇక సినీ కెరీర్ ముగుస్తున్న సమయం లో రాజకీయాల్లోకి అడుగుపెట్టింది..1994 వ సంవత్సరం లో తెలుగు దేశం పార్టీ లో చేరిన ఈమె కొంతకాలం తెలుగు దేశం పార్టీ మహిళా ప్రెసిడెంట్ గా పనిచేసింది..ఆ తర్వాత చంద్రబాబు నాయుడు తో ఏర్పడిన కొన్ని విభేదాల కారణం గా ఆ పార్టీ కి రాజీనామా చేసి సమాజ్ వాది పార్టీ లో చేరింది..2009 వ సంవత్సరాం ఉత్తర్ ప్రదేశ్ లోని రాంపూర్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసిన జయప్రద 85000 ఓట్ల మార్జిన్ తో గెలుపొంది పార్లమెంట్ లోకి అడుగుపెట్టింది.

    ఇక లేటెస్ట్ గా 2019 వ సంవత్సరం లో బీజేపీ పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయిన జయప్రద కి ఇప్పుడు లేటెస్ట్ గా ఒక ఎదురుదెబ్బ తగిలింది..ఎన్నికల సంఘం నియమాలను ఉల్లగించినందుకు గాను ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ కి చెందిన ప్రత్యేక కోర్టు ఆమెకి నాన్ బెయిలబుల్ వారంట్ ని జారీ చేసింది.విచారణ నిమ్మిత్తం ఆమెని రెండు సార్లు పిలిచినా కూడా కోర్టు కి రాలేదని..అందుకే ఆమెకి నోటీసులు పంపామని, వచ్చే మంగళవారం ఆమె కోర్టు కి హాజరు కాకపోతే అరెస్ట్ చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది..ప్రస్తుతం ఈ వార్త మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..కానీ జయప్రద నుండి మాత్రం ఈ విషయం పై ఎలాంటి స్పందన రాలేదు..రీసెంట్ గానే ఆమె నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK ‘ ప్రోగ్రాం కి ముఖ్య అతిథి గా హాజరయ్యింది.