https://oktelugu.com/

Dasara Keerthi Suresh : ‘దసరా’ సినిమాకు కీర్తి సురేష్ ఎలా డబ్బింగ్ చెప్పిందో చూస్తే తట్టుకోలేరంతే?

Dasara Keerthi Suresh : కీర్తి సురేష్.. ‘మహానటి’ మూవీలో అద్భుతంగా నటించి జాతీయ అవార్డు పొందింది. అంతకుముందు సినిమాల్లో కూడా ఈమె నటనకు అవార్డులు వచ్చాయి. అయితే దసరాలో హీరోయిన్ క్యారెక్టర్ కోసం దర్శకుడు శ్రీకాంత్ ఈమెను రిజెక్ట్ చేశాడట.. లావుగా ఉండాలని.. క్యారెక్టర్ కు సూట్ కాదని అన్నాడట.. కానీ హీరో నాని నచ్చజెప్పి మరీ ఆమె నేషనల్ అవార్డ్ గ్రహీత అంటూ ఒప్పించి కాంప్రమైజ్ చేసి నటింపచేశాడు. కానీ నవ్విన నాపచేనే పండింది. […]

Written By:
  • NARESH
  • , Updated On : April 13, 2023 / 11:47 AM IST
    Follow us on

    Dasara Keerthi Suresh : కీర్తి సురేష్.. ‘మహానటి’ మూవీలో అద్భుతంగా నటించి జాతీయ అవార్డు పొందింది. అంతకుముందు సినిమాల్లో కూడా ఈమె నటనకు అవార్డులు వచ్చాయి. అయితే దసరాలో హీరోయిన్ క్యారెక్టర్ కోసం దర్శకుడు శ్రీకాంత్ ఈమెను రిజెక్ట్ చేశాడట.. లావుగా ఉండాలని.. క్యారెక్టర్ కు సూట్ కాదని అన్నాడట.. కానీ హీరో నాని నచ్చజెప్పి మరీ ఆమె నేషనల్ అవార్డ్ గ్రహీత అంటూ ఒప్పించి కాంప్రమైజ్ చేసి నటింపచేశాడు.

    కానీ నవ్విన నాపచేనే పండింది. ఇప్పుడు కీర్తి సురేష్ ‘దసరా’ సినిమాలో నటనకు ప్రశంసలు కురుస్తున్నాయి. దసరాలో అద్భుతంగా కీర్తి సురేష్ నటించిందంటూ కొనియాడుతున్నారు.

    అయితే తెలుగు సరిగా రాకున్నా నేర్చుకొని మరీ కీర్తి సురేష్ ‘దసరా’ సినిమా కోసం స్వయంగా డబ్బింగ్ చెప్పింది. విశేషం ఏంటంటే ఆమె తెలంగాణ యాసలో ఈ డబ్బింగ్ చెప్పింది. చెన్నై చిన్నది తెలంగాణ యాసలో అంత అద్భుతంగా చెబుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ చించి పడేసింది. ఆ ఎమోషన్ ను పండించింది. యాసను బతికించింది.

    కీర్తి సురేష్ చెప్పిన ఆ డైలాగ్ వీడియోను తాజాగా దసరా మూవీ టీం విడుదల చేసింది. ఆమె చెబుతుంటే మనకే రోమాలు నిక్కబొడిచేలా ఉంది. అంతలా దసరా హీరోయిన్ క్యారెక్టర్ లో ఆమె ఒదిగిపోయిందని చెప్పొచ్చు.