SarkaruVaariPaata trailer leaked : మహేష్ బాబు హీరోగా వస్తున్న ‘సర్కారి వారి పాట’ సినిమాకు లీకుల బెడద పట్టుకుంది. తాజాగా విడుదలకు రెడీ అయిన ఈ సినిమా ట్రైలర్ లీక్ అయ్యింది. ఈ సినిమా మరికొన్ని రోజుల్లో విడుదల చేయనున్నారు. ఈ మూవీ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను గోప్యంగా ఉంచుతున్నారు. ట్రైలర్ విడుదల చేసి ఫ్యాన్స్ లో జోష్ పెంచుదామని అనుకున్నారు.
అయితే సినిమాకు సంబంధించిన కొన్ని అప్ డేట్స్ ను లీకువీరులు ముందుగానే బయటపెట్టేస్తున్నారు. మూవీ టీం అఫీషియల్ గా విడుదల చేయకముందే సోషల్ మీడియాలో లీక్స్ అవుతూ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజాగా ఇప్పుడు సర్కారి వారి పాట ట్రైలర్ కూడా లీక్ అవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
మే 12న సర్కారివారి పాటను విడుదల చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈసినిమాకు ‘గీతా గోవిందం’ దర్శకుడు పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు. బ్యాంక్ రికవరీ ఏజెంట్ గా మహేష్ ఇందులో నటిస్తున్నాడు.
సర్కారి వారి పాట తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రం యూనిట్ కొన్ని అప్డేట్స్ తో అంచనాలు పెంచింది. ఈ సినిమాలోని పాటలు అదిరిపోయాయి. కళావతి సాంగ్ ఊపేస్తోంది. ఈ క్రమంలోనే ట్రైలర్ విడుదలకు రెడీ చేస్తున్న వేళ అనుకోని షాక్ తగిలింది.
సోమవారం ట్రైలర్ విడుదలకు ముహూర్తం పెట్టగా.. ట్రైలర్ కు సంబంధించిన కొన్ని సీన్స్ ఎడిటింగ్ జరుగుతున్నప్పుడే మొబైల్ తో వీడియో తీయడంతో లీక్ అయ్యాయి. ఈ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మహేష్ సినిమా ట్రైలర్ కట్ చేస్తున్నప్పుడే ఎవరో ఎడిటింగ్ రూంలో మొబైల్ తో తీశారని.. అలా లీక్ అయ్యిందని తెలుస్తోంది. ఈ లీక్ పై సర్కారి వారి పాట టీం యాక్షన్ తీసుకునే పనిలో పడింది. ఎవరు లీక్ చేసిందనే దానిపై ఆరాతీస్తోంది.
లీకైన వీడియో ఇదే..
https://www.youtube.com/shorts/Pt4EK-zTd4o
https://youtube.com/shorts/Pt4EK-zTd4o?feature=share