2023 Sankranthi Tollywood Movies : ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూస్తున్న సమయంలో నవ్వులపాలు చేసేలా చేసిన సంక్రాంతి సినిమాలు

2023 sankranthi movies : టాలీవుడ్ నుండి ఇప్పుడు ఒక సినిమా వస్తుందంటే అది ప్రాంతీయ భాషా చిత్రం కాదు..పాన్ వరల్డ్ సినిమా..క్వాలిటీ పరంగా, టెక్నికల్ పరంగా తెలుగు సినిమా ఇప్పుడు హాలీవుడ్ కి ఏ మాత్రం తీసిపోదు..మన దగ్గర భారీ బడ్జెట్ తో అద్భుతమైన విజువల్స్ తో సినిమాలు తీసే డైరెక్టర్స్ ఉన్నారు..అలాగే అతి తక్కువ బడ్జెట్ తో కళ్లుచెదిరే విజువల్స్ తో సినిమాలు తీసే నైపుణ్యం ఉన్నవాళ్లు కూడా ఉన్నారు. కానీ మన టాలీవుడ్ […]

Written By: NARESH, Updated On : January 15, 2023 9:39 am
Follow us on

2023 sankranthi movies : టాలీవుడ్ నుండి ఇప్పుడు ఒక సినిమా వస్తుందంటే అది ప్రాంతీయ భాషా చిత్రం కాదు..పాన్ వరల్డ్ సినిమా..క్వాలిటీ పరంగా, టెక్నికల్ పరంగా తెలుగు సినిమా ఇప్పుడు హాలీవుడ్ కి ఏ మాత్రం తీసిపోదు..మన దగ్గర భారీ బడ్జెట్ తో అద్భుతమైన విజువల్స్ తో సినిమాలు తీసే డైరెక్టర్స్ ఉన్నారు..అలాగే అతి తక్కువ బడ్జెట్ తో కళ్లుచెదిరే విజువల్స్ తో సినిమాలు తీసే నైపుణ్యం ఉన్నవాళ్లు కూడా ఉన్నారు.

కానీ మన టాలీవుడ్ ని ప్రపంచపటంలో అందనంత ఎత్తుకి ప్రతీ ఒక్కరు చూసేలా చేసిన దర్శకుడు మాత్రం రాజమౌళినే.. మగధీర సినిమాతోనే ఆయన నేషనల్ లెవెల్ లో పాపులారిటీని సంపాదించాడు.. ఆ తర్వాత బాహుబలి సినిమాతో మన టాలీవుడ్ పరిశ్రమని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాడు.. ఇక గత ఏడాది ఆయన తీసిన మల్టీస్టారర్ చిత్రం #RRR ఒక పక్క బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ పెట్టడమే కాకుండా , అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో అనేక అవార్డ్స్ ని సాధించి ఇప్పుడు ఆస్కార్ అవార్డ్స్ రేస్ లో కూడా నిలబడింది.

ప్రతీ ఒక్కరు టాలీవుడ్ వైపు చూసి, మన సినిమాలను ,హీరోలను మరియు డైరెక్టర్స్ ని మెచ్చుకుంటూ నెంబర్ 1 ఇండస్ట్రీ గా కొనియాడుతున్న ఈ నేపథ్యంలో కొంతమంది డైరెక్టర్స్ 1990 కాలం నాటి స్టోరీ లతో ఆడియన్స్ ని చావబాదే ప్రయత్నం చేస్తూ తెలుగు సినిమా పరువు తీసేలా చేస్తున్నారు.. అందుకు ఉదాహరణగా నిలిచినవే రీసెంట్ గా విడుదలైన సంక్రాంతి సినిమాలు ‘వాల్తేరు వీరయ్య’ మరియు ‘వీర సింహా రెడ్డి’..అభిమానులు తమ హీరోలను ఎలా అయితే చూడాలి అనుకుంటున్నారో,అలా చూపించే క్రమంలో ఈ రెండు చిత్రాల దర్శకులు రొటీన్ కి భిన్నంగా సరికొత్తగా తీసే ప్రయత్నం చెయ్యలేదు.

పాత చింతకాయ పచ్చడే ప్రేక్షకులకు రుచి చూపించారు.. కమర్షియల్ గా అవి వర్కౌట్ అవ్వొచ్చేమో కానీ , క్వాలిటీ పరంగా చూస్తే మాత్రం నాసిరకంగానే అనిపిస్తాయి.. తెలుగు సినిమాకి ఈ రేంజ్ గుర్తింపు వచ్చినప్పుడు కూడా కుర్ర డైరెక్టర్స్ ఇలాంటి సినిమాలు తీసి ఏమి సందేశం అందిస్తున్నట్టు..?, వీళ్ళకి ఇలా తప్ప మరోలాగా తియ్యడం రాదా..? , లేదా సాహసం చేయలేకపోతున్నారా..ఈ విషయంలో మన పక్క రాష్ట్రం తమిళనాడు యువ దర్శకులను చూసి నేర్చుకోవాలి.. ఉదాహరణకి కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాని తీసుకుందాం. దీనికి కమల్ హాసన్ వీరాభిమాని లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించాడు..’వాల్తేరు వీరయ్య’ డైరెక్టర్ బాబీ లాగా ఇతగాడు రొటీన్ కమర్షియల్ పద్దతిలో సినిమా తియ్యలేదు..సరికొత్త కాన్సెప్ట్ తో ఎంతో ట్రెండీ గా తమ అభిమాన హీరో కమల్ హాసన్ ని చూపించాడు..అలా బాబీ ఎందుకు చెయ్యలేకపోయాడు..?, మెగాస్టార్ ని చూపించడానికి రొటీన్ కమర్షియల్ సినిమా తప్ప మరొకటి కనిపించలేదా అనే విమర్శలు ఎదురు అవుతున్నాయి. ఇంకా బాలయ్య బాబు వీరసింహారెడ్డి లో నరుకుడు తప్ప ఇంకా ఏం లేదు. రాయలసీమ ను రాక్షససీమగా మార్చారు. ఇలాంటి సినిమాలతో ఏం మెసేజ్ ఇస్తున్నట్టో ఈ నవతరం దర్శకులు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి