Sankranthi Release Movies 2023: సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి, బాలకృష్ణల రెండు భారీ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. అటు రెండు తమిళ డబ్ సినిమాలను రిలీజ్ చేయడానికి తెలుగు నిర్మాత దిల్ రాజు ప్రయత్నించడంతో నిర్మాతల మండలి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ సంక్రాంతికి డబ్ సినిమాలను రిలీజ్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రకటనపై దిల్ రాజు మౌనం వహించారు. కానీ మరో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాత్రం డబ్బింగ్ సినిమాలను రిలీజ్ చేయడం ఆపేది లేదని అన్నారు. దీనిపై నిర్మాతల మండలి డబ్ సినిమాలను సంక్రాంతికి రిలీజ్ చేస్తే పర్యావసనాలు తప్పవని హెచ్చరించింది. అయితే మెగాస్టార్, నందమూరి పలుకుబడితో థియేటర్లకు కొదవ ఉండదు. మరి డబ్ సినిమాలపై ఎవరు భయపడుతున్నారు..? అనేది ఆసక్తిగా మారింది.
తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ సంక్రాంతికి సినిమా ఇండస్ట్రీకి డబుల్ ధమాకా ఉంటుంది. కొందరు నిర్మాతలు తాము తీసిన సినిమాలను సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని అనుకుంటారు. నార్మల్ డేస్ కంటే ఫెస్టివల్ సీజన్లో సినిమాలను రిలీజ్ చేస్తే కచ్చితంగా వర్కౌట్ అవుతుందని అనుకుంటారు. ఇందులో భాగంగా ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాలను రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అసలు విషయమేంటంటే ఈ రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
ఇదిలా ఉండగా ఇదే ఫెస్టిఫల్ సందర్భంగా తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘వారసుడు’, ‘తునివు’లను తెలుగులో రిలీజ్ చేయాలని దిల్ రాజు నిర్ణయించుకున్నారు. అందుకోసం కొన్ని థియేటర్లను కూడా దక్కించుకున్నారు. అయితే ఈసారి తమిళ డబ్ సినిమాలను రిలీజ్ చేయొద్దని తెలుగు నిర్మాతల మండలి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా డబ్ సినిమాలను రిలీజ్ చేస్తే చర్యలు తప్పవని కూడా హెచ్చరింది. దీంతో దిల్ రాజు మౌనంగా ఉండిపోయారు. కానీ అల్లు అరవింద్ మాత్రం డబ్బింగ్ సినిమాల రిలీజ్ ను ఆపేది లేదని అంటున్నాడు.
అయితే మెగాస్టార్ చిరంజీవి బావ మరిది అయిన అల్లు అరవింద్ ఇలా అనడంపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లు తమిళ డబ్ సినిమాలతో మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’కు ఎఫెక్ట్ అవుతుందని అనుకున్నారు. కానీ అల్లు అరవింద్ మాత్రం ఇలాంటి ప్రకటన చేయడం ఆశ్చార్యాన్ని కలిగించింది. ఈ విషయం పక్కనబెడితే చిరంజీవి సినిమాలను అల్లు అరవింద్ చెడగొట్టే ప్రయత్నం చేయలేడు. అవసరమైతే ఆయన కోసం థియేటర్లను వదులుకుంటారు. సో… మెగాస్టార్ సినిమాకు ఇబ్బంది లేదు. ఇక నందమూరి పలుకుబడి ఏంటో తెలియంది కాదు. ఆయన సినిమా స్ట్రాట్ అయిందంటేనే కొన్ని థియేటర్లు రెడీ అవుతాయి. ఈ తరుణంలో ఆయన ‘వీర సింహారెడ్డి’ని సంక్రాంతికి డేట్ ఫిక్స్ చేశాడు. బాలకృష్ణ సినిమాకు ఎలాగోలా థియేటర్లు దక్కే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి.
దీంతో అసలు ఎవరి సినిమాలకు నష్ఠం అని గగ్గోలు పెడుతున్నారని కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. అసలు తమిళ సినిమాలను అడ్డుకున్నంత మాత్రాన కంటెంట్ బాగా లేకున్నా తెలుగు సినిమాలను ఆదరిస్తారా..? అని అంటున్నారు. అంతేకాకుండా తమిళ డబ్ సినిమాలను కొందరు మాత్రమే ఆదరిస్తారు. ఫ్యామిలీ మెంబర్ష్ వెళ్లడం చాలా తక్కువే. మరి ఈ సమస్య ఎక్కడ స్ట్రాట్ అయింది..? అసలు ఆ సినిమాల గురించి ఎవరు భయపడుతున్నారు..? అనేది హాట్ టాపిక్ గా మారింది.