
Hero – Heroine : సందీప్ కిషన్ మైఖేల్ మూవీ ప్రమోషన్స్ లో తనపై వస్తున్న ఎఫైర్ రూమర్స్ మీద ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం తాను సింగిల్ అన్నారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానంగా… నాకు రిలేషన్స్ సెట్ కావు. కారణం నేను చాలా సెన్సిటివ్. ఒక అమ్మాయిని ఇష్టపడితే ఆమె గురించే ఆలోచిస్తాను. ఎప్పుడూ ఆమెతో మాట్లాడాలి, కలవాలి అనుకుంటాను. నా భాగస్వామిగా ఉన్న అమ్మాయిపై ఎక్కువగా ఆధారపడతాను. ప్రతి విషయంలో ఆమె సలహా తీసుకుంటాను. ఆమెను ఈజీగా వదులుకోలేను. గతంలో నేను బ్రేకప్ బాధను అనుభవించాను. ఆ ప్రేమ దెబ్బలు గట్టిగా తగిలాయి. గత ఏడాది నేను ఒక అమ్మాయి విషయంలో మానసిక వేదనకు గురయ్యానని చెప్పారు.
సందీప్ కామెంట్స్ పరిశీలిస్తే ఆయనకు ఓ అమ్మాయి హ్యాండ్ ఇచ్చినట్లు అర్థం అవుతుంది. ఇద్దరి మధ్య స్ట్రాంగ్ రిలేషన్ నడిచాక ఆమె అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయినట్లు ఆయన పరోక్షంగా హింట్ ఇచ్చాడు. ఒకసారి నచ్చితే వదులుకోవడం కష్టం అన్నాడు కాబట్టి… ప్రేమించిన అమ్మాయి తనను వదిలి వెళ్లిపోయిందని క్లారిటీ వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం. అలాగే హీరోయిన్ రెజీనా కాసాండ్రతో వచ్చిన ఎఫైర్ రూమర్స్ మీద ఆయన స్పందించారు.
తనకు ఏ హీరోయిన్ తో ఎఫైర్ లేదు. మేము మంచి మిత్రులం మాత్రమే అని చెప్పుకొచ్చారు. రెజీనా కాసాండ్రా-సందీప్ కిషన్ గతంలో రొటీన్ లవ్ స్టోరీ, రారా క్రిష్ణయ్య చిత్రాల్లో కలిసి నటించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందనే పుకార్లు తెరపైకి వచ్చాయి. ఈ వార్తలకు సందీప్ సమాధానం చెప్పారు. ఇక సందీప్ కిషన్ లేటెస్ట్ మూవీ మైఖేల్ ఫిబ్రవరి 3న విడుదలైంది. మైఖేల్ మూవీ డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. ఫలితం ఏమిటో తెలియాలంటే ఈ వీకెండ్ వరకు వేచి చూడాలి.
రంజిత్ జయకోడి మైఖేల్ చిత్ర దర్శకుడిగా ఉన్నారు. విజయ్ సేతుపతి, వరలక్ష్మి, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అనసూయ, వరుణ్ సందేశ్ కీలక రోల్స్ చేశారు. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటించారు. కాగా సందీప్ హీరోగా రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి. తెలుగులో ఆయన ‘ఊరు పేరు భైరవకోన’ టైటిల్ తో ఓ చిత్రం చేస్తున్నారు. అలాగే ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నారు. సందీప్ కిషన్ కి కోలీవుడ్ లో కూడా గుర్తింపు ఉంది. మైఖేల్ చిత్రానికి సందీప్ చాలా కష్టపడ్డారు. రోల్ కోసం ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ సాధించారు. ప్రతి సినిమాకు సందీప్ కష్టపడుతున్నారు. ఆశించిన ఫలితం మాత్రం రావడం లేదు.