https://oktelugu.com/

Michael Movie Review: సందీప్ కిషన్ ‘మైఖేల్’ మూవీ ఫుల్ రివ్యూ

Michael Movie Review: నటీనటులు : సందీప్ కిషన్ ,విజయ్ సేతుపతి , వరలక్ష్మి శరత్ కుమార్ ,దివ్యంకా కౌశిక్, వరుణ్ సందేశ్ , గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు నిర్మాతలు : భరత్ చౌదరి & పుస్కుర్ రామ్ మోహన్ రావు డైరెక్టర్ : రంజిత్ జయకోడి మ్యూజిక్ డైరెక్టర్ : సామ్ సీఎస్ సినిమాటోగ్రఫీ : కిరణ్ కౌశిక్ కొంతమందికి మంచి టాలెంట్ ఉన్నప్పటికీ కూడా టైం కలిసిరాక ఇండస్ట్రీ లో సరైన హిట్ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 3, 2023 / 09:42 AM IST
    Follow us on

    Michael Movie Review: నటీనటులు : సందీప్ కిషన్ ,విజయ్ సేతుపతి , వరలక్ష్మి శరత్ కుమార్ ,దివ్యంకా కౌశిక్, వరుణ్ సందేశ్ , గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు

    నిర్మాతలు : భరత్ చౌదరి & పుస్కుర్ రామ్ మోహన్ రావు
    డైరెక్టర్ : రంజిత్ జయకోడి
    మ్యూజిక్ డైరెక్టర్ : సామ్ సీఎస్
    సినిమాటోగ్రఫీ : కిరణ్ కౌశిక్

    Michael Movie Review

    కొంతమందికి మంచి టాలెంట్ ఉన్నప్పటికీ కూడా టైం కలిసిరాక ఇండస్ట్రీ లో సరైన హిట్ దొరకక ఇబ్బంది పడుతూ ఉంటారు..అలాంటి హీరోలలో ఒకడు సందీప్ కిషన్..వేంకటాద్రి ఎక్సప్రెస్ అనే ఒక్క సినిమా మినహా ఇతని కెరీర్ లో సూపర్ హిట్ అనేదే లేదు..మధ్యలో లోకేష్ కనకరాజ్ దర్శకత్వం లో వచ్చిన నగరం అనే సినిమా పర్వాలేదు అనిపిస్తుంది కానీ కమర్షియల్ గా ఆ సినిమా కూడా వర్కౌట్ అవ్వలేదు..అయినప్పటికీ తన ప్రయత్నం ఆగలేదు..విబిబిన్నమైన కథామాసాలతో సూపర్ హిట్ కొట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పర్చుకోడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు..ఈసారి బలంగా కొట్టాలనే ఉద్దేశ్యం తో పాన్ ఇండియా లెవెల్ లో మైఖేల్ అనే చిత్రం ద్వారా మన ముందుకు వచ్చాడు..మరి ఈ సినిమాతోనైనా సుందీప్ కిషన్ హిట్టు కొట్టాడా..లేదా మరి కొద్దీ రోజులు హిట్ కోసం ఎదురు చూడాల్సిందేనా అనేది ఇప్పుడు మనం ఈ రివ్యూ లో చూడబోతున్నాము.

    కథ:

    మైఖేల్ అనే కుర్రాడు తన చిన్నతనం నుండే పెద్ద గ్యాంగ్ స్టర్ అవ్వాలని కలలు కంటూ ఉంటాడు..ఆ లక్ష్జ్యం తోనే పెద్దయ్యాక ఒక గ్యాంగ్ లో చేరుతాడు..ఆ గ్యాంగ్ లో అతని పనితనం ని బట్టి అంచలంచలుగా తానూ కోరుకున్న స్థానం లోకి వెళ్తున్న సమయం లో తీరా అనే అమ్మాయి పరిచయం అవుతుంది..ఆ అమ్మాయి తో ప్రేమలో పడుతాడు మైఖేల్..ఆ అమ్మాయి మైఖేల్ జీవితం లోకి అడుగుపెట్టిన తర్వాత వచ్చిన మార్పులేంటి,ఆమె గతం ఏమిటి ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

    విశ్లేషణ :

    క్రైమ్ జానర్ లో వచ్చే సినిమాలను చూడడానికి జనాలు బాగా ఇష్టపడుతారు..కానీ రొటీన్ గా అనిపిస్తే మాత్రం ఫలితం చాలా దారుణంగా వస్తుంది..విడుదలకు ముందు ట్రైలర్ లో ఈ సినిమా కథ ఏమిటో క్లారిటీ లేకుండా , ఎవరికీ అర్థం కాకుండా చేసాడు డైరెక్టర్ రంజిత్ జయకోడి..ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక సినిమా సక్సెస్ కావాలంటే ముందుగా ట్రైలర్ అందరిని ఆకట్టుకోవాలి..అప్పుడే హైప్ వస్తుంది..హైప్ వస్తేనే ఓపెనింగ్స్ కూడా వస్తాయి..రంజిత్ జయకోడి అలా చెయ్యడం లో సక్సెస్ కాలేకపోయాడు..ట్రైలర్ లో కథ ఏమిటో చూపించకపోయినప్పటికీ సినిమా మాత్రం ప్రారంభం నుండే కథలోకి అడుగుపెడుతుంది..ప్రారంభం లో కాస్త గ్రిప్పింగ్ గా , ఆసక్తికరంగానే సాగినప్పటికీ, ఆ తర్వాత రొటీన్ అనిపించడం తో ఇంటర్వెల్ వరకు కాస్త బోర్ కొడుతాది..ద్వితీయార్థం లో కూడా అలాగే అనిపిస్తుంది..టెక్నికల్ మాత్రం అద్భుతంగా అనిపించినప్పటికీ కథ బలంగా గా లేకపోవడం ఈ సినిమాకి పెద్ద మైనస్..ఇంటర్వెల్ అప్పుడు వచ్చే ట్విస్ట్ కాస్త ఉపశమనం కల్పిస్తుంది.

    Michael Movie Review

    ఇక నటీ నటుల విషయానికి సందీప్ కిషన్ ఎప్పటిలాగానే విభిన్నంగా నటించడానికి ప్రయత్నం చేసాడు కానీ ఎందుకో ఆయన నటన సహజత్వానికి దగ్గరగా లేదు అనే భావన కలిగిస్తాది..ఇక హీరోయిన్ దివ్యంకా కౌశిక్ తెర మీద చాలా అందంగా కనిపించింది కానీ , నటన పరంగా ఆమె ఆకట్టుకోలేకపోయింది..ఇక ఈ సినిమాలో నటించిన తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి మరియు వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రలు బాగున్నాయి..కానీ నిడివి తక్కువ..ఇక వరుణ్ సందేశ్ ఎందుకో తనకి సూట్ కానీ పాత్ర చేసాడని అనిపిస్తుంది..ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా ఇందులో ఒక కీలక పాత్ర పోషించాడు..ఆయన నటన కూడా బాగుంది..అయితే మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ పాటలు వినడానికి బాగాలేవు కానీ , చూడడానికి బాగున్నాయి.

    చివరి మాట : క్రైమ్ యాక్షన్ డ్రామా ని నచ్చే ప్రేక్షకులు ఒకసారి ఈ సినిమాని చూసేయొచ్చు..గడిచిన రెండు వీకెండ్స్ లో విడుదలైన సినిమాలకంటే ఈ చిత్రం మేలైనది.

    రేటింగ్ : 2 .5 /5

    Tags