
Samantha: సమంతను అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఆమె పూర్తిగా కోలుకున్న దాఖలాలు లేవు. సమంతను కళ్ళ సమస్య కూడా వెంటాడుతోందని సమాచారం. ఆమె కాంతిని చూడలేకపోతున్నారట. తాజా వీడియో దీన్ని నిర్ధారిస్తుంది. సమంత ఇటీవల ముంబై వెళ్లారు. శాకుంతలం ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. సమంతను చూసిన వెంటనే బాలీవుడ్ మీడియా ఫోటోలు తీసేందుకు ఎగబడింది. కెమెరా ఫ్లాష్ లైట్స్ ఆమెను విపరీతంగా ఇబ్బందిపెట్టాయి. ఆమె వాటిని ఫేస్ చేయలేకపోయారు.
ఫోటోలకు ఫోజులు ఇవ్వాలని ఫోటోగ్రాఫర్స్ అడిగారు. సారీ నాకు కొంచెం ఇబ్బందిగా ఉందంటూ రిక్వెస్ట్ చేశారు. అయినా మీడియా ఫోటోలు తీయడం మానలేదు. కాంతివంతమైన లైట్స్ వైపు సమంత చూడలేకపోతున్నారని ఈ సంఘటనతో రుజువైంది. ఆల్రెడీ దీనిపై సమంత స్పష్టత ఇచ్చారు. నేను కళ్ళ జోడు పెట్టుకున్నా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నాకు కళ్ళ సమస్య ఉంది. విపరీతమైన కాంతిని నా కళ్లు తల్లుకోలేవు. అందుకే కళ్ళజోడు పెట్టుకుంటున్నానని సమంత వివరణ ఇచ్చారు.
ఈ క్రమంలో సమంత మయోసైటిస్ నుండి పూర్తిగా కోలుకోలేదన్న అభిప్రాయం వినిపిస్తుంది. గత ఏడాది అక్టోబర్ నెలలో సమంత తనకు మయోసైటిస్ సోకిన విషయం బయటపెట్టారు. ఇంస్టాగ్రామ్ వేదికగా చికిత్స తీసుకుంటున్న ఫోటో విడుదల చేశారు. రెండు నెలలుగా సమంత బిజీ అయ్యారు. తిరిగి షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. దీంతో ఆమె కోలుకున్నారని అభిమానులు భావిస్తున్నారు.

శాకుంతలం చిత్రానికి సమంత ఓన్లీ స్టార్ట్ అట్రాక్షన్. ఆమె తప్పకుండా ప్రమోషన్స్ లో పాల్గొనాల్సిన పరిస్థితి. అందుకే అనారోగ్యాన్ని పట్టించుకోకుండా… విరివిగా ప్రమోషన్స్ చేస్తున్నారు. దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం చిత్రాన్ని తెరకెక్కించారు. దిల్ రాజు నిర్మించారు. ఏప్రిల్ 14న శాకుంతలం విడుదల కానుంది.అలాగే సమంత సిటాడెల్, ఖుషి ప్రాజెక్ట్స్ షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు.
సిటాడెల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ దర్శకులుగా ఉన్నారు. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు. ఇక ఖుషి మూవీలో విజయ్ దేవరకొండకు జంటగా సమంత నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకుడు. ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 1న విడుదల కానుంది.
View this post on Instagram