https://oktelugu.com/

Samantha’s Emotional Post : నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదంటూ సమంత ఎమోషనల్ పోస్ట్

Samantha’s emotional post : సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్స్ లో ఒకరైన సమంత ఎల్లప్పుడూ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ ఉండే విషయం మన అందరికి తెలిసిందే.తన మనసులో ఉన్న ఆలోచనలను ఎప్పటికప్పుడు ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ఆమె పెట్టే పోస్టులు మరియు స్టోరీలను చూస్తే సమంత ఎంత ఎమోషనల్ మనిషి అనేది అందరికీ అర్థం అవుతాది.రీసెంట్ గా ఆమె పెట్టిన పోస్ట్ అలాంటిదే.ఇక అసలు విషయానికి వస్తే […]

Written By: , Updated On : March 4, 2023 / 10:28 PM IST
Follow us on

Samantha’s emotional post : సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్స్ లో ఒకరైన సమంత ఎల్లప్పుడూ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ ఉండే విషయం మన అందరికి తెలిసిందే.తన మనసులో ఉన్న ఆలోచనలను ఎప్పటికప్పుడు ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ఆమె పెట్టే పోస్టులు మరియు స్టోరీలను చూస్తే సమంత ఎంత ఎమోషనల్ మనిషి అనేది అందరికీ అర్థం అవుతాది.రీసెంట్ గా ఆమె పెట్టిన పోస్ట్ అలాంటిదే.ఇక అసలు విషయానికి వస్తే ప్రముఖ మహిళా దర్శకురాలు నందిని రెడ్డి పుట్టిన రోజు నేడు.

ఈ సందర్భంగా సమంత ఆమెని ట్యాగ్ చేస్తూ ఎమోషనల్ గా పెట్టిన ఒక పోస్టు వైరల్ గా మారింది.ఆమె మాట్లాడుతూ ‘జీవితం లో నీలాంటి స్నేహితురాలు ఉండడం నేను చేసుకున్న అదృష్టం.ఎంతటి కష్టతరమైన పరిస్థితి ఎదురైనా దుఃఖం అనేది నా దరిదాపుల్లోకి కూడా రానివ్వవు..నేను బాధపడాల్సిన సమయం లో కూడా నన్ను నవ్విస్తావు.నేను అతి కష్టసమయం లో ఉన్నప్పుడు నువ్వు నా పక్కన లేకపోతే నేను ఎమైపొయ్యేదానినో..లవ్ యూ..హ్యాపీ బర్త్డే’ అంటూ సమంత పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

సమంత – నందిని రెడ్డి కాంబినేషన్ లో గతంలో ‘జబర్దస్త్’ మరియు ‘ఓ బేబీ’ వంటి సినిమాలు వచ్చాయి.వీటిల్లో ‘ఓ బేబీ’ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలబడడమే కాకుండా సమంతకి నటిగా మంచి పేరు తీసుకొచ్చింది.ఈ రెండు సినిమాల షూటింగ్స్ సమయంలోనే వీళ్లిద్దరు బాగా క్లోజ్ అయ్యారు.ఇక సమంత ఇటీవలే తనకి సోకినా మయోసిటిస్ అనే వ్యాధి నుండి బయటపడిన సంగతి తెలిసిందే.ఇప్పుడు ఆమె వరుసగా సినిమాలలో నటించడానికి డేట్స్ ఇచ్చేసింది.

ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ తెరకెక్కిస్తున్న ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘సీటా డెల్’ లో నటిస్తుంది.అమెరికన్ పాపులర్ వెబ్ సిరీస్ ‘సీటా డెల్’ ఇండియన్ వెర్షన్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు.ఇందులో సమంత ‘రా ఏజెంట్’ గా నటిస్తుంది.భారీ పోరాటసన్నివేశాలతో ప్రేక్షకుల మతులను పోగట్టబోతుంది ఈ హాట్ బ్యూటీ.ఈ వెబ్ సిరీస్ తో పాటుగా విజయ్ దేవరకొండ తో ‘ఖుషి’ అనే చిత్రం లో నటిస్తుంది.ఇప్పటికే 50 శాతం షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా , బ్యాలన్స్ షూటింగ్ లో త్వరలోనే పాల్గొనబోతుంది సమంత.