Shaakuntalam Premiere Show Review: మహాభరతం ఇతిహాసం లోని ముఖ్యమైన ఘట్టాలను సినిమా రూపం లో ఆవిష్కరిస్తే చూడాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. మహాభారతం స్టోరీ ఇది వరకే మనం ఎన్నో సార్లు చూసి ఉంటాము, కానీ శకుంతల దేవి గారి ఘట్టాన్ని వివరంగా ఇప్పటి వరకు ఎవ్వరు చూపించలేదు. పాత సినిమాల్లో కేవలం ఒకటి రెండు సన్నివేశాలకు పరిమితం చేసారు కానీ, ఎందుకో ఆమె కథని పూర్తి స్థాయిలో వివరిస్తూ ఒక సినిమాగా ఎవ్వరూ చెయ్యలేదు. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఈ విషయాన్నీ పసిగట్టాడు,వెంటనే దిల్ రాజు తో చర్చలు జరిపి శాకుంతలం అనే చిత్రాన్ని సమంత ని పెట్టి తీసాడు.ఇది ఆయన డ్రీం ప్రాజెక్ట్. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోస్ ని హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టిప్లెక్స్ లో ప్రదర్శించారు. ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో,సినిమా అంచనాలకు రీచ్ అయ్యిందో లేదో ఒకసారి ఈ రివ్యూ లో చూద్దాము.
కథ :
ఇది భరతుడి సామ్రాజ్యం మొదలవ్వక్కముందు అతని తల్లి తండ్రులు దుష్యంత మహారాజు మరియు శాకుంతలం మధ్య జరిగిన కథ.వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక రోజు దుర్వాస మహాముని వీళ్ళు ఉంటున్న కుటీరానికి అతిథిగా వస్తాడు,దుష్యంత మహారాజు మరియు శకుంతల దేవి ఆతిధ్యం లో లోటుపాట్లు ఉండడం, దుష్యంత మహారాజు ని తల్చుకుంటూ అతని లోకంలోనే విహరిస్తూ దుర్వాస మహాముని ఆతిధ్య మర్యాదలు చెయ్యడానికి మర్చిపోతుంది. ఆగ్రహానికి గురైన దుర్వాస మహాముని నువ్వు ఎవరి గురించి అయితే తల్చుకుంటూ పరితపిస్తునావో అతను నిన్ను మర్చిపోతాడు అని శపిస్తాడు.ఇక ఆ తర్వాత శకుంతల దేవి ఎలాంటి పరిస్థితులను ఎదురుకుంది, దుర్వాస మహాముని శాపాన్ని దాటి దుష్యంత మహారాజుని ఎలా చేరుకుంది అనేది వెండితెర మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
గొప్ప కథ ఉంటే సరిపోదు, దానికి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే కూడా ఉండాలి,ఈ రెండిట్లో ఏది లోపించిన సినిమా ఫలితం తేడా అయిపోతుంది.శాకుంతలం విషయం లో గుణశేఖర్ చేసింది అదే. ఈ చిత్రం స్క్రీన్ ప్లే అసలు ఆడియన్స్ కి ఏమాత్రం కూడా నచ్చే విధంగా లేదు,గ్రాఫిక్స్ చాలా నాసిరకంగా ఉన్నాయి. ఒక పెద్ద కథ చెప్తున్నప్పుడు భారీ బడ్జెట్ తో , క్వాలిటీ గ్రాఫిక్ వర్క్ చెయ్యాలి.కానీ గుణ శేఖర్ తన మార్కెట్ ఇంతే అని ఫీల్ అయ్యి ఎక్కువ బడ్జెట్ పెట్టడానికి రిస్క్ తీసుకున్నాడో ఏమో తెలీదు కానీ,గ్రాఫిక్స్ విషయం లో చాలా నాసిరకం తో కూడిన ఔట్పుట్ ని ఇచ్చాడు.ఇక సమంత నటన బాగానే ఉంది కానీ, డబ్బింగ్ విషయం లో కాస్త కేర్ తీసుకొని ఉండుంటే బాగుండేది అనిపించింది. మిగిలిన నటీనటులు కూడా వాళ్ళ పరిధిమేర బాగానే నటించారు కానీ సినిమా చూస్తున్నంత సేపు బోరింగ్ ఫీల్ వస్తుంది, అదే ఈ చిత్రానికి పెద్ద మైనస్.మరి ఎల్లుండి విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి ఆడియన్స్ నుండి కూడా ఇదే రెస్పాన్స్ వస్తుందా లేదా అనేది చూడాలి.