Shaakuntalam Review: నటీనటులు :
సమంత , దేవ్ మోహన్ , మోహన్ బాబు , అల్లు అర్హ, అనన్య నాగేళ్ల, ప్రకాష్ రాజ్, సచిన్ ఖేద్కర్,శివ బాలాజీ, వర్షిణి, గౌతమి తదితరులు
డైరెక్టర్ : గుణ శేఖర్
సంగీతం : మణిశర్మ
నిర్మాతలు : దిల్ రాజు, గుణ శేఖర్
సౌత్ ఇండియన్ టాప్ స్టార్ హీరోయిన్ సమంత ఈమధ్య విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఒక సెపెరేట్ మార్కుని ఏర్పాటు చేసుకుంటుంది. ఈమధ్యనే ‘యశోద’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ తో సూపర్ హిట్ ని అందుకున్న సమంత, ఇప్పుడు ‘శాకుంతలం’ అనే సినిమాతో మన ముందుకి వచ్చింది. మహాకవి కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం అనే గ్రంధాన్ని అధ్యాయనం చేసి డైరెక్టర్ గుణశేఖర్ తీసిన ఈ సినిమా తెలుగు తో పాటుగా హిందీ , తమిళం మరియు మలయాళం బాషలలో విడుదల కాబోతుంది. ఈమధ్యనే ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షో ని హైదరాబాద్ లోని ప్రసాద్ ముల్టీప్లెక్స్ లో వేశారు. ఈ షో ద్వారా ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ వచ్చింది. అయితే ఈరోజు సినిమా విడుదల అయ్యినందున ఓవరాల్ గా సినిమాలో ఎలా ఉందో ఇప్పుడు మనం ఈ రివ్యూ లో చూడబోతున్నాము.
కథ :
మహాభారతం ప్రారంభం కాకముందు,భరతుడి శకం మొదలవ్వకముందు అతని తల్లి తండ్రులు దుశ్యంత మహారాజు(దేవ్ మోహన్) మరియు శకుంతల(సమంత) మధ్య జరిగిన ప్రేమ కథ ఇది. వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక రోజు దుర్వాస మహాముని(మోహన్ బాబు) వీళ్ళు ఉంటున్న కుటీరానికి అతిథిగా వస్తాడు,అతిధి మర్యాదలు చెయ్యడానికి అన్నీ ఏర్పాట్లు చేసుకుంటుంది కానీ దుశ్యంత మహారాజు పరధ్యానం లో అతనిని తల్చుకుంటూ దుర్వాస మహాముని కి అతిథి మర్యాదలు చెయ్యడం లో తడబడుతుంది శకుంతల. ఆగ్రహానికి గురైన దుర్వాస మహాముని నువ్వు ఎవరి గురించి అయితే తల్చుకుంటూ పరితపిస్తునావో అతను నిన్ను మర్చిపోతాడు అని శపిస్తాడు. ఇక ఆ తర్వాత శకుంతల దేవి ఎలాంటి పరిస్థితులను ఎదురుకుంది, దుర్వాస మహాముని శాపాన్ని దాటి దుష్యంత మహారాజుని ఎలా చేరుకుంది అనేది వెండితెర మీద చూడాల్సిందే.
విశ్లేషణ :
మహాభారతం పుస్తకం చదివిన ఎవరికైనా ఈ సినిమా స్టోరీ తెలిసే ఉంటుంది.పుస్తకం లో చదివినప్పుడు మన మైండ్ లో విజువల్స్ కనపడుతూ ఉంటాయి, అదే ఈ మహాకావ్యం లో ఉన్న గొప్పదనం. ఈ విజువల్స్ ని సినిమా రూపం లో సరిగ్గా తీస్తే చూడాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది.విజువల్స్ కి తగ్గట్టు సినిమా తియ్యాలంటే ఖర్చు విషయం లో అస్సలు తగ్గకూడదు. కానీ ఈ చిత్రాన్ని గుణశేఖర్ మరియు నిర్మాత దిల్ రాజు ఖర్చు విషయం లో భయపడ్డారని విషయం ఈ సినిమా చూస్తున్న ప్రతీ ఒక్కరికీ అర్థం అయిపోతుంది. అద్భుతంగా ఉండాల్సిన గ్రాఫిక్స్ కనీసం యావరేజి స్థాయిలో కూడా ఉండదు. టేకింగ్ విషయం లో పర్వాలేదు అనిపించినా క్వాలిటీ విషయం లో మాత్రం నిర్మాతలు వెనకడుగువేశారు.అదే ఈ చిత్రానికి పెద్ద మైనస్, ఇక నటీనటుల విషయానికి వస్తే సమంత గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది, ఎలాంటి పాత్రలో అయినా జీవించడమే ఆమెకి తెలుసు, ఈ చిత్రం లో కూడా అదే చేసింది.
కానీ డబ్బింగ్ ఆమె చెప్పకుండా వేరే డబ్బింగ్ ఆర్టిస్టుతో చెప్పించి ఉంటే బాగుండేది అనిపించింది. ఇక దుష్యంత మహారాజు గా నటించిన దేవ్ మోహన్ కూడా పర్వాలేదు అనే విధంగానే నటించాడు. ఈ సినిమాలో మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సింది అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ గురించి. భరతుడి చిన్నప్పటి పాత్రలో కనిపించిన అల్లు అర్హ ఉన్నంతసేపు కేవలం ఆమెని మాత్రమే చూస్తాము, వేరే నటీనటులను చూడలేము, చూడడానికి సిల్వర్ స్క్రీన్ మీద ఆమె అంత చక్కగా కనిపించింది. నటీనటుల విషయం లో మాత్రం ఎవరి పాత్రకి తగ్గట్టు చక్కగా నటించారు.వైఫల్యం మొత్తం డైరెక్టర్ లోనే ఉంది, స్క్రీన్ ప్లే మరియు టేకింగ్ విషయం లోను, అలాగే గ్రాఫిక్స్ క్వాలిటీ తో చేయించుకోవడం లో ఆయన విఫలం అయ్యాడు. ఫలితంగా ఈ సినిమా కమర్షియల్ గా అనుకున్న స్థాయికి చేరుకునే అవకాశం లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.
చివరి మాట :
మహాభారతం ని ఇష్టపడే వాళ్ళు,ఈ సినిమాని ఒకసారి ట్రై చెయ్యొచ్చు. 2D కంటే కూడా 3D వెర్షన్ లో మంచి అనుభూతి కలుగుతుంది. గ్రాఫిక్స్ మరియు క్వాలిటీ ని ఆశించి ఈ సినిమాకి వెళ్తే మాత్రం నిరాశకి గురి అవుతారు.
రేటింగ్ : 2.5/5