https://oktelugu.com/

Shakuntalam Samantha : ‘శాకుంతలం’ నష్టాలను పూడుస్తున్న సమంత.. తీసుకున్న రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసిందా!

Shakuntalam Samantha Rutuprabhu : విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ నటిగా గొప్ప పేరు తెచ్చుకుంటున్న సమంత కి రీసెంట్ గా విడుదలైన ‘శాకుంతలం’ చిత్రం గట్టి దెబ్బ తీసిందనే చెప్పాలి.డైరెక్టర్ గుణశేఖర్ ఈ చిత్రానికి దర్సకవం వహిస్తూ సహా నిర్మాతగా కూడా వ్యవహరించాడు.ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా మరో నిర్మాత.ఎప్పుడో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కరోనా కారణం గా షూటింగ్స్ వాయిదా పడుతూ ఎట్టకేలకు ఈమధ్యనే పాన్ ఇండియా లెవెల్ అన్నీ ప్రాంతీయ భాషల్లో ఘనంగా […]

Written By:
  • NARESH
  • , Updated On : April 18, 2023 / 10:38 PM IST
    Follow us on

    Shakuntalam Samantha Rutuprabhu : విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ నటిగా గొప్ప పేరు తెచ్చుకుంటున్న సమంత కి రీసెంట్ గా విడుదలైన ‘శాకుంతలం’ చిత్రం గట్టి దెబ్బ తీసిందనే చెప్పాలి.డైరెక్టర్ గుణశేఖర్ ఈ చిత్రానికి దర్సకవం వహిస్తూ సహా నిర్మాతగా కూడా వ్యవహరించాడు.ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా మరో నిర్మాత.ఎప్పుడో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కరోనా కారణం గా షూటింగ్స్ వాయిదా పడుతూ ఎట్టకేలకు ఈమధ్యనే పాన్ ఇండియా లెవెల్ అన్నీ ప్రాంతీయ భాషల్లో ఘనంగా విడుదల అయ్యింది.

    అయితే మొదటి రోజు మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి ఓపెనింగ్ కనీస స్థాయి లో కూడా దక్కలేదు.పెట్టిన బడ్జెట్ కి వచ్చిన ఓపెనింగ్ కి అసలు సంబంధమే లేదు,రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి మొదటి రోజు కోటి రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ సినిమా,ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి రెండు కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది.

    ఇక రెండవ రోజు మూడవ రోజు చెరో 50 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టిన ఈ సినిమా, సోమవారం నుండి అన్నీ ప్రాంతాలలో దాదాపుగా క్లోసింగ్ స్థాయికి వచ్చేసింది.మొత్తం మీద ఈ చిత్రం ఇప్పటి వరకు కనీసం 5 కోట్ల రూపాయిల షేర్ ని కూడా రాబట్టలేదు.నిర్మాతలకు మరియు బయ్యర్స్ కి భారీ నష్టాలు.సమంతని కూడా ఈ ఫ్లాప్ డిప్రెషన్ కి గురి చేసింది.

    ఇది ఇలా ఉండగా ఈ సినిమా కోసం సమంత దాదాపుగా 8 కోట్ల రూపాయిల వరకు రెమ్యూనరేషన్ తీసుకుందని టాక్, సినిమాకి ఘోరమైన ఫలితం రావడం తో తీసుకున్న రెమ్యూనరేషన్ నుండి 50 శాతం, అంటే నాలుగు కోట్ల రూపాయిలు వెనక్కి ఇచ్చినట్టు ఫిలిం నగర్ లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది.ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ చూడాలి, ఒకవేళ నిజం అయితే మాత్రం సమంత తీసుకున్న నిర్ణయానికి సెల్యూట్  చేయకతప్పదు.