Samantha- Myositis: స్టార్ హీరోయిన్ సమంతకు ప్రాణాంతక ‘మైయాసిటీస్’ అనే వ్యాధి సోకిందని తేలింది. ఆమెనే ఈ మేరకు సోషల్ మీడియాలో ఈ ప్రాణాలు తీసే వ్యాధి వచ్చిందని.. దీనికి చికిత్స తీసుకుంటున్నట్టు సంచలన ప్రకటన చేసింది. ఇది చూసి అందరూ షాక్ అవుతున్నారు. సినీ ఇండస్ట్రీ, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సమంతకు వచ్చిన ఆ ‘మ్యూసిటీస్’ వ్యాధి ఏంటి? ఎలా వస్తుంది? బతుకుతారా? లేదా? అని ఆరాతీస్తున్నారు.

ప్రస్తుతం తెలుగు, దక్షిణాది భాషలు, హిందీల్లో వరుస సినిమాలు చేస్తోంది. సమంత నటించిన ‘యశోద’ మూవీ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఆ ప్రమోషన్స్ లోకూడా సమంత పాల్గొనకలేకపోవడానికి ఈ వ్యాధి కారణమని.. ఆమె చికిత్స తీసుకుంటున్నట్టు సమాచారం. తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న మూవీలోనూ సమంతనే హీరోయిన్ . ఇక ‘శాకుంతలం’లో కూడా మెయిన్ రోల్ పోషించింది. ఇటీవలే ఆమె బర్త్ డే సందర్భంగా అందరూ విషెస్ తెలిపారు.
సమంత జీవితం ఇక కుదుటపడుతుందనుకుంటున్న సమయంలో మరో షాకింగ్ వార్త చెప్పింది. అది సినీ ఇండస్ట్రీతోపాటు అభిమానులను షాక్ కు గురిచేసింది.
తనకు ప్రాణాంతకమైన ‘మ్యూసిటీస్’ అనే వ్యాధి ఉన్నట్లు ఇన్ స్టాగ్రామ్ లో సమంత షాకింగ్ విషయం చెప్పింది. చేతికి సెలైన్ ఎక్కించుకుంటున్న ఫొటోను వెనుక నుంచి చూపిస్తూ లవ్ గుర్తును సింబాలిక్ గా పెట్టి ఫొటో షేర్ చేసింది.

మానసికంగా.. శారీరకంగా ఎన్నో కష్టాలను చూశానని.. ఇక ఇవి నేను భరించలేనంత స్థాయిలోనూ కష్టాలు వచ్చాయి.. కానీ అవన్నీ ఎలాగో గడిచిపోయాయి.. ఇక ఇది కూడా త్వరలోనే సమసిపోతుందని ఆశిస్తున్నానని సమంత చెప్పుకొచ్చింది.
-అసలేంటి మ్యూసిటీస్ వ్యాధి
మ్యూసిటీస్ అనేది కండరాల దీర్ఘకాలిక, కండర వాపుకు సంబంధించిన వ్యాధి. దీన్ని ఒకరకం చర్మ వ్యాధి అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి వల్ల కండరాల బలహీనత, ఎక్కువ సేపు నిల్చోలేకపోవడం.. నడవలేకపోవడం.. నీరసంగా ఉండడం దాని లక్షణాలు. ఈ వ్యాధి సోకితే చర్మం దద్దుర్లుతో మంటపుట్టిస్తుంటుంది. ఈ అరుదైన వ్యాధిని నిర్ధారించడం కష్టం, కారణం కొన్నిసార్లు తెలియదు. లక్షణాలు కాలక్రమేణా వేగంగా.. క్రమంగా కనిపిస్తాయి. ప్రాథమిక లక్షణాలుగా కండరాల నొప్పి, పుండ్లు పడడం, అలసట, మింగడంలో ఇబ్బంది , శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కలిగి ఉండవచ్చు. పురుషుల కంటే స్త్రీలు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది.
అతిగా మేకప్ వేసుకోవడం వల్ల.. అందం కోసం చేసుకున్న చికిత్సల వల్ల ఈ వ్యాధి సమంతకు వచ్చి ఉండవచ్చని అందరూ అనుకుంటున్నారు. ఇటు సమంత వ్యక్తిగత జీవితంలోని ఈ ఆటుపోట్లను చూసి అందరూ అయ్యో పాపం అంటున్నారు.