https://oktelugu.com/

Samantha: తన ఎఫైర్స్ , పిల్లలు వద్దన్నానన్న రూమర్లపై సమంత సంచలన ప్రకటన

Samantha: టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత-నాగచైతన్య విడాకుల ప్రకటన వచ్చిన మరుక్షణం.. మీడియాలో, సోషల్ మీడియాలో ఈ వ్యవహారంలో మొత్తం తప్పు సమంతదేనన్నట్టుగా ఫోకస్ అయ్యింది. పెళ్లి అయినా కూడా సమంత సినిమాలు ఆపలేదని.. ఇటీవల బోల్డ్ సినిమాల్లో నటించిందని..పిల్లలను కనకుండా వాయిదా వేసిందని.. ఇక ఎవరో స్టైలిస్ట్ తో క్లోజ్ గా మూవీ అయ్యిందని… ఇలా రకరకాల ఆరోపణలు సమంత చుట్టూనే వస్తున్నాయి. సమంత వ్యవహారశైలి వల్లే ఆమెకు విడాకులు అయ్యాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 8, 2021 / 04:32 PM IST
    Follow us on

    Samantha: టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత-నాగచైతన్య విడాకుల ప్రకటన వచ్చిన మరుక్షణం.. మీడియాలో, సోషల్ మీడియాలో ఈ వ్యవహారంలో మొత్తం తప్పు సమంతదేనన్నట్టుగా ఫోకస్ అయ్యింది. పెళ్లి అయినా కూడా సమంత సినిమాలు ఆపలేదని.. ఇటీవల బోల్డ్ సినిమాల్లో నటించిందని..పిల్లలను కనకుండా వాయిదా వేసిందని.. ఇక ఎవరో స్టైలిస్ట్ తో క్లోజ్ గా మూవీ అయ్యిందని… ఇలా రకరకాల ఆరోపణలు సమంత చుట్టూనే వస్తున్నాయి. సమంత వ్యవహారశైలి వల్లే ఆమెకు విడాకులు అయ్యాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

    ఈ రూమర్లపై తాజాగా సమంత స్పందించింది. ఎంతో మంది నా గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారని వాటన్నింటికి తెరదించేందుకే ఈ ప్రకటన చేస్తున్నట్టుగా సమంత తెలిపింది. ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది.

    ‘నాపై మీరు చూపిస్తున్న సానుభూతికి కృతజ్ఞతలు’ అంటూ సమంత మొదలుపెట్టింది. కొందరు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారని విమర్శించింది. నాకు ఎఫైర్స్ ఉన్నాయని.. పిల్లల్ని వద్దనుకున్నానని.. అబార్షన్ చేయించుకున్నానని.. నేను అవకాశవాదినని అంటున్నారని.. ఆరోపిస్తున్నారని పోస్ట్ లో వాపోయింది. విడాకులు తీసుకోవడం అనేది ఎంతో బాధతో కూడుకున్నదని సమంత తెలిపింది. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండని సోషల్ మీడియాలో వేడుకుంది.

    వ్యక్తిగతంగా నాపై దాడి చేయకుండా దయచూపండి.. వాళ్లు చెప్పినట్లు ఏవీ కూడా భవిష్యత్ లో జరగవని నేను మాటిస్తున్నా’ అంటూ సమంత తనపై వస్తున్న రూమర్స్ కు చెక్ పెడుతూ ఓ ట్వీట్ చేసింది.

    ఇన్నాళ్లు మీడియాలో కేవలం సమంతదే తప్పు అని మీడియా, సోషల్ మీడియాలో ఫోకస్ చేసింది. కానీ తన తప్పు ఏం లేదని అన్నట్టుగా తాజాగా ప్రకటన చేసింది. మరీ ఈ ప్రకటనతోనైనా సమంతపై రూమర్స్ కు చెక్ పడుతుందా లేదా? అన్నది చూడాలి.