
Samantha Boxing: సూపర్ స్టార్స్… స్టార్ హీరోయిన్స్ ఊరికే అయిపోరు. దాని వెనుక కృషి, పట్టుదల, శ్రమ ఉంటాయి. ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో పుట్టిన సమంత టాప్ హీరోయిన్ గా ఎదిగారు. ఇండియా వైడ్ ఫేమ్ తెచ్చుకున్నారు. కేవలం తన టాలెంట్ తో పైకొచ్చిన అమ్మాయిగా సమంతను చెప్పుకోవచ్చు. సమంత కెరీర్లో హైట్స్ చూశారు. తిరుగులేని ఫేమ్ తెచ్చుకున్నారు. అయినా ఆమె రిలాక్స్ కావడం లేదు. ఇంకా ఏదో సాధించాలనే తపనతో ముందుకు వెళుతున్నారు. వృత్తి పట్ల సమంతకు ఎంత నిబద్ధత ఉందో తాజా ఉదంతం తెలియజేస్తుంది.
సమంత ప్రధాన పాత్రలో సిటాడెల్ సిరీస్ తెరకెక్కుతుంది. సిటాడెల్ ఫస్ట్ షెడ్యూల్ ముంబైలో పూర్తి చేశారు. నెక్స్ట్ షెడ్యూల్ కోసం నార్త్ ఇండియా వెళ్లారు. చలి ప్రదేశం నైనిటాల్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో యాక్షన్ కొరియోగ్రాఫర్ యన్నిక్ బెన్ నేతృత్వంలో సమంత స్టంట్స్ ప్రాక్టీస్ చేస్తుంది. రాత్రివేళ 8 డిగ్రీల చలిలో బాక్సింగ్ చేస్తూ సమంత చెమటలు కక్కిస్తుంది. ఒంటిపై కేవలం జిమ్ ఫిట్ మాత్రమే ఉంది. సిటాడెల్ సిరీస్ కోసం సమంత ఎంత కష్టపడుతున్నారో ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది.
ఇటీవల సమంతతో కలిసి పని చేసిన ప్రముఖ నటుడు మనోజ్ బాజ్ పాయ్ సమంత మీద ప్రశంసలు కురిపించారు. ఆమె ఒక సన్నివేశం కోసం శరీరాన్ని ఎంత కష్టానికైనా గురి చేస్తారు. సమంత చాలా కమిటెడ్ యాక్ట్రెస్ అని చెప్పారు. ది ఫ్యామిలీ మాన్ 2లో సమంత, మనోజ్ నటించారు. సమంత లేడీ టెర్రరిస్ట్ రోల్ చేశారు. ఒక ప్రక్క మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ రుగ్మతతో బాధపడుతూ సమంత పాత్ర కోసం ప్రతికూల వాతావరణంలో వర్క్ చేయడం గొప్ప విషయం.

సిటాడెల్ సిరీస్ నందు వరుణ్ ధావన్ సైతం నటిస్తున్నారు. ది ఫ్యామిలీ మాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకులుగా ఉన్నారు. నార్త్ ఇండియా షెడ్యూల్ అనంతరం విదేశాలకు వెళ్లనున్నారు. సౌత్ ఆఫ్రికాతో పాటు పలు దేశాల్లో సిటాడెల్ షూట్ జరపనున్నారు. అలాగే సమంత ఖుషి చిత్ర షూట్లో పాల్గొనాల్సి ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది.