
Samantha: టాలీవుడ్ లో అందం తో టాలెంట్ పుష్కలంగా ఉన్న హీరోయిన్స్ లో ఒకరు సమంత.నాగ చైతన్య రెండవ సినిమా ‘ఏం మాయ చేసావే’ తో ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైన సమంత, తొలి సినిమాతోనే తిరుగులేని క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించి స్టార్ లీగ్ లోకి అడుగుపెట్టింది.ఆ తర్వాత ఈమె వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి హిట్టు మీద హిట్టు కొట్టి ఎవ్వరూ అందుకోలేని రేంజ్ కి వెళ్ళింది.
కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు, ఈమె సౌత్ లోనే మోస్ట్ క్రేజీ డిమాండ్ ఉన్న హీరోయిన్, అలాంటి హీరోయిన్ అప్పుడప్పుడు యువ హీరోల సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించింది.ముఖ్యంగా బెల్లంకొండ సురేష్ కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మొదటి సినిమా ‘అల్లుడు శ్రీను’ లో సమంత హీరోయిన్ గా నటించడం అప్పట్లో సెన్సేషనల్ టాపిక్ అయ్యింది.
అలా ఎలాంటి భేదభావాలు లేకుండా నటించే మనస్తత్వం ఉన్న సమంత ఒక హీరో తో మాత్రం 5 కోట్ల ఆఫర్ వచ్చినా చెయ్యడానికి ఇష్టపడలేదట.ఆ హీరో మరెవరో కాదు, బెల్లం కొండ శ్రీనివాస్.మొదటి సినిమా అల్లుడు శ్రీను లో హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకున్న సమంత ఇప్పుడు మాత్రం ఎందుకు ఒప్పుకోలేదు అనే ప్రశ్న అందరిలో తలెత్తింది.ఇక అసలు విషయానికి వస్తే RX 100 లాంటి సంచలనాత్మక చిత్రాన్ని తీసిన డైరెక్టర్ అజయ్ భూపతి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరియు సమంత కాంబినేషన్ లో మహాసముద్రం అనే చెయ్యాలనుకున్నాడు.

కానీ సమంత ఇందులో హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకోలేదట.ఎందుకంటే ఇందులో రొమాన్స్ సన్నివేశాలు ఎక్కువ ఉండడమే, 5 కోట్ల పారితోషికం ఇస్తామని చెప్పినా సమంత ససేమీరా ఒప్పుకోలేదట, ముఖ్యంగా బెల్లంకొండ శ్రీనివాస్ వయస్సులో సమంత కంటే చాలా చిన్న, అందుకే ఆమె రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.తర్వాత ఈ సినిమాని శర్వానంద్, అదితి రావు హయాద్రి మరియు సిద్దార్థ్ కాంబినేషన్ లో తీశారు.పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.