https://oktelugu.com/

Samantha Comments on Teja Sajja: హీరో పోస్ట్ పై సీరియస్ అయిన సమంత.. నా స్వాగ్ అంతా నాశనం చేశారంటున్న హీరో..

Samantha Comments on Teja Sajja: సమంత సౌత్ స్టార్ హీరోయిన్ లలో ఒకరు. ఈమె గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు.. ఈమె ఏమాయ చేసావే సినిమాతో ప్రేక్షకులను మాయ చేసింది.. మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత ఈమె వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస అవకాశాలు వచ్చి స్టార్ హీరోయిన్ అయ్యింది. టాలీవుడ్ టాప్ హీరోలందరితో సమంత నటించి మెప్పించింది. […]

Written By:
  • Mallesh
  • , Updated On : February 20, 2022 / 05:37 PM IST
    Follow us on

    Samantha Comments on Teja Sajja: సమంత సౌత్ స్టార్ హీరోయిన్ లలో ఒకరు. ఈమె గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు.. ఈమె ఏమాయ చేసావే సినిమాతో ప్రేక్షకులను మాయ చేసింది.. మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత ఈమె వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస అవకాశాలు వచ్చి స్టార్ హీరోయిన్ అయ్యింది.

    Samantha Comments on Teja Sajja

    టాలీవుడ్ టాప్ హీరోలందరితో సమంత నటించి మెప్పించింది. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా మారిపోయింది సామ్..ఇక ఇటీవలే ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య తో విడాకులు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చింది. వీరి విడాకుల తర్వాత కొద్దీ రోజులు సైలెంట్ గా ఉన్న సామ్ ఆ తర్వాత ఆ బాధ నుండి బయట పడేందుకు మళ్ళీ వరుస సినిమాలు చేస్తుంది.

    Samantha Comments on Teja Sajja

    ఇక ఈమె ఇప్పుడు ఏం చేసినా, ఎవరి మీద కామెంట్ చేసిన కూడా అది హాట్ టాపిక్ గా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎప్పుడు ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను పంచుకోవడమే కాకుండా బయట జరిగే వాటి మీద కూడా కామెంట్స్ చేస్తూ ఉంటుంది. తాజగా ఈమె ఒక హీరోపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

    Also Read: ఇండస్ట్రీ పెద్ద కోసం మోహన్ బాబు పాకులాటే కొంపముంచిందా?

    సమంత టాలీవుడ్ యంగ్ హీరో అయిన తేజ సజ్జ ఫోటోలపై కామెంట్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఓ బేబీ లో తన కోస్టార్ అయినా తేజ సజ్జ ను ఆటపట్టిస్తూ ఆమె కామెంట్స్ చేసింది. ఇటీవలే తేజ సజ్జ తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.. అలాగే ఎక్స్ క్యూజ్ మీ లేడీస్ అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు.. అంతే కాక దానికి ఓ బేబీ డైరెక్టర్ నందిని రెడ్డిని కూడా ట్యాగ్ చేసాడు.

    ఆ పోస్ట్ కి స్పందించిన సమంత.. ‘అంటే ? ఒక్క సినిమా కోసం.. అంత ఈజీ అనుకున్నావా.. మనం అతనికి ఏమీ నేర్పించలేదా.. అంటూ నందిని మీద సీరియస్ అయ్యింది. ఈ దెబ్బకు తేజ ”ఇప్పుడు మీరు నా స్వాగ్ మొత్తం నాశనం చేసారు” అంటూ ఫీల్ అవుతూ కామెంట్ చేసాడు. ఈ కామెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

    Also Read: అసలైన ప్రేమ అంటే సిరి-శ్రీహాన్ లదే.. షణ్ముఖ్-దీప్తి సునయన వీరిని చూసి నేర్చుకోవాలా?

    Recommended Video:

    Tags