Samantha: సమంత ప్రస్తుత హెల్త్ కండిషన్ ఏమిటనేది ఎవరికీ తెలియదు. తనకు మయోసైటిస్ సోకిందని చెప్పిన తర్వాత ఒక్కసారి మాత్రమే మీడియా ముందుకు వచ్చారు. యాంకర్ సుమ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత తన ఆరోగ్య పరిస్థితి వివరించారు. మీడియాలో వచ్చినట్లు నేను చనిపోవడం లేదు. అలా అని ఇది చిన్న సమస్య కూడా కాదు. నేను పోరాడి ఈ మహమ్మారి నుండి బయటపడాల్సి ఉంది. నాకు ఆ నమ్మకం ఉంది… అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఆ ఇంటర్వ్యూ అనంతరం అప్పుడప్పుడూ ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ పెడుతున్నారు. ఈ క్రమంలో మీడియాలో పలురకాల పుకార్ల చక్కర్లు కొడుతున్నాయి.

ఇటీవల ప్రముఖ జాతీయ మీడియా సంస్థ సమంత హెల్త్ కండిషన్ పై ఆర్టికల్ ప్రచురించింది. మేము సమంత సన్నిహిత వర్గాలతో మాట్లాడాము. వారిచ్చిన సమాచారం ప్రకారం… సమంత కోలుకున్నారు. త్వరలో ఆమె కెమెరా ముందుకు వస్తారు. చివరి దశలో ఉన్న ఖుషి షూటింగ్ పూర్తి చేస్తున్నారు. అనంతరం వెబ్ సీరీస్ సిటాడెల్ షూట్ స్టార్ట్ చేస్తారు. సమంత ఆరోగ్యం క్షీణిస్తుంది అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారని, ప్రచురించారు. ఈ వార్త సమంత అభిమానుల్లో ఆనందం నింపింది.
సదరు కథనంలో వాస్తవం ఉందని సమంత లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ తో క్లారిటీ వచ్చింది. ఆమె వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. శాకుంతలం చిత్రానికి డబ్బింగ్ చెబుతున్నారు. ఇది సమంత తన ఇంటి వద్దనే చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటో ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. జనవరి 17న శాకుంతలం విడుదల కానుంది. ఈ క్రమంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేస్తున్నారు. సమంత తన పార్ట్ డబ్బింగ్ కంప్లీట్ చేస్తున్నారు.

శాకుంతలం చిత్రానికి డబ్బింగ్ చెబుతున్న ఫొటోతో పాటు సమంత ఒక ఆసక్తికర కోట్ పోస్ట్ చేశారు. ప్రముఖ రచయిత్రి నిక్కీ రో చెప్పిన ”నా బాధలకు, పిచ్చికి, జీవితంలోకి కోల్పోయిన వాటికి కళనే మందు. దాని సహాయంతో నేను నా గమ్యం చేరుకుంటాను” అనే కోట్ షేర్ చేశారు. సినిమా అనే కళే నా బాధలకు, కష్టాలకు, సమస్యలకు ట్రీట్మెంట్ అని సమంత సదరు కోట్ తన జీవితానికి అన్వయించుకున్నారు. తిరిగి వర్క్ లో బిజీ కావడం ద్వారా అన్నీ మర్చిపోయి మానసిక ప్రశాంత సాధిస్తానని ఆమె పరోక్షంగా చెప్పారు.