Salman Khan: బాలీవుడ్ లో కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే హీరో సల్మాన్ ఖాన్..5 పదుల వయస్సు దాటినప్పటికీ కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ తో డేటింగ్ చేస్తూ తన కాలాన్ని అలా గడిపేస్తున్నాడు..కోట్లాది మంది కుర్రాళ్ళు పడి చచ్చేంత అందం ఉన్న ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ ఇతని మేజిక్ కి పడిపోవడం ఆశ్చర్యార్డకం.

ఆ రోజుల్లో ఈయన ప్రముఖ స్టార్ హీరోయిన్, విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ తో నడిపిన ప్రేమాయణం గురించి ఇప్పటికీ బాలీవుడ్ లో మాట్లాడుకుంటూనే ఉంటారు..పెళ్లి పీటల దాకా వెళ్లిన వీళ్లిద్దరి ప్రేమాయణం కి చివరి నిమిషం లో బ్రేక్ పడింది..అందుకు కారణం కూడా లేకపోలేదు..గతం లో సల్మాన్ ఖాన్ ఐశ్వర్య రాయ్ తో ప్రేమాయణం నడుపుతూనే , ప్రీతీ జింటా తో కూడా మరో లవ్ ట్రాక్ నడిపాడు.
వీళ్లిద్దరు ఆరోజుల్లో చేసుకున్న రాసలీలలు బాలీవుడ్ లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది..అంతే కాదు వీళ్లిద్దరి ఫోన్ కాల్ సంభాషణ కూడా అప్పట్లో లీక్ అయ్యి కలకలం సృష్టించింది..ఈ విషయం తెలుసుకున్న ఐశ్వర్య రాయ్ సల్మాన్ ఖాన్ తో పెద్ద గొడవ పెట్టుకుంది..సల్మాన్ ఖాన్ కూడా నిజం ఒప్పుకోవడం తో అతనికి బ్రేకప్ చెప్పేసింది..అప్పటి నుండి ఇప్పటి వరకు సల్మాన్ ఖాన్ మరియు ఐశ్వర్య రాయ్ మాట్లాడుకునట్టు దాఖలాలు కూడా లేవు..ఇక ఆ తర్వాత ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ ని ప్రేమించి పెళ్లాడింది.

ప్రీతి జింటా కూడా 2016 వ సంవత్సరం లో ఫిబ్రవరి 29 వ తారీఖున జీన్ గుడ్ఎనఫ్ ని పెళ్ళాడి , ఇద్దరు పిల్లలకు కూడా జన్మనిచ్చింది..కానీ సల్మాన్ ఖాన్ మాత్రం ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు..వీళిద్దరితో ప్రేమాయణం నడిపిన తర్వాత కత్రినా కైఫ్ తో చాలా కాలం వరకు డేటింగ్ చేసాడు..ఆ తర్వాత జాక్విలిన్ తో కొన్ని రోజులు డేటింగ్ చేసాడు..ప్రస్తుతం మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి.