
Salaar : ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో కాంబినేషన్స్ కి మార్కెట్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు.కేవలం కాంబినేషన్ అయితే చాలు వందల కోట్ల రూపాయిలు పెట్టి బిజినెస్ చేసేస్తున్నారు.ఇప్పుడు ప్రభాస్ ‘సలార్’ విషయం లో కూడా అదే జరుగుతుంది.ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ సూపర్ స్టార్ తో, KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ చేస్తున్నాడు అని ప్రకటన వచ్చిన రోజు నుండే ఈ సినిమాకి మార్కెట్ లో క్రేజ్ ఆకాశాన్ని తాకింది.ఇప్పుడు ఈ చిత్రం చిత్రీకరణ చివరి దశకి చేరుకుంది.
ముందు అనుకున్న విధంగానే ఈ సినిమాని ఈ ఏడాది సెప్టెంబర్ 22 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా తెలుగు తో పాటు హిందీ, తమిళం , మలయాళం మరియు కన్నడ బాషలలో ఘనంగా విడుదల కానుంది.ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ అన్నీ ప్రాంతాలలో ప్రారంభం అయ్యింది.
ముఖ్యంగా ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ చూస్తే మార్కెట్ లో ఈ చిత్రం పై ఎలాంటి క్రేజ్ ఉందో అర్థం అవుతుంది.ఈ సినిమాని అన్నీ భాషలకు కలిపి అక్కడ బయ్యర్స్ 10 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారట, అది కూడా కేవలం అమెరికాలోనే.ఇప్పటి వరకు అమెరికా లో అత్యధిక వసూళ్ళను రాబట్టిన టాప్ 2 తెలుగు సినిమాలు ఒకటి బాహుబలి (22 మిలియన్ డాలర్లు) , మరొకటి #RRR(14 మిలియన్ డాలర్లు).
ఈ రెండు సినిమాలు తప్ప మిగిలిన సినిమాలన్నీ నాలుగు మిలియన్ లోపే వసూళ్ళను రాబట్టాయి.అలాంటిది సలార్ చిత్రం బ్రేక్ ఈవెన్ నెంబర్ 10 మిలియన్ డాలర్లు ఉండడం అనేది సెన్సేషనల్ అనే అనుకోవాలి.ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ చిత్రం అమెరికా లో బ్రేక్ ఈవెన్ అవ్వాలనే 80 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించాలి.సరైన టీజర్ మరియు ట్రైలర్ పడితే అవలీలగా బ్రేక్ ఈవెన్ మార్కు ని అందుకుంటుంది అని అంటున్నారు విశ్లేషకులు.