Saint Tukaram- Saint Dnyaneshwar Padukas: మనదేశంలో దైవశక్తికి కొదవేలేదు. మనసులో దేవుడిని స్మరించుకుంటూ ఎన్ని కిలోమీటర్లయినా నడుస్తారు. ఎంత దూరమైనా కదులుతారు. ఎండను లెక్కచేయరు. వానను పట్టించుకోరు. కానీ వారి ప్రయాణం మాత్రం ఆగదు. వేయి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలైనట్లు ఎంత దూరమైనా నడకతోనే సాగుతారు. వారిలో ఏ శక్తి దాగి ఉందో తెలియదు. వారిని ఎవరు నడిపిస్తున్నారో అర్థం కాదు. కానీ ప్రయాణం మాత్రం మానరు. కొనసాగిస్తూనే ఉంటారు.
సంత ధ్యానేశ్వర్ మరియు శాంత్ తుకారాం పాదుకలను మోస్తూ పండరీపూర్ చేరుకుంటారు. వారికి దిశా నిర్దేశం చేసే వారు ఎవరు ఉండరు. నాయకులు లేరు. నిధులు రావు. ప్రకటనలు కూడా లేవు. కానీ వారిలో విభేదాలు పొడచూపవు. వారు అనుకున్నది కచ్చితంగా నెరవేర్చడానికి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పుణే చుట్టు పక్కల గ్రామాల నుంచి 8 లక్షల మంది రావడం సంచలనం కలిగిస్తుంది.
వారిని ఎవరు కూడా ఆర్గనైజ్ చేయరు. నాయకత్వం వహించరు. అందరు ఎవరికి వారే తమ బాధ్యతగా భావించి వస్తుంటారు. ఇదో గొప్ప దైవ భక్తి ప్రక్రియ. వారిలో దేవుడు ఉన్నాడనడానికి ఇదే నిదర్శనం. వారిని ఏదో తెలియని శక్తి నడిపిస్తుంది. అంత దూరం కూడా ప్రయాణించి వారి మొక్కులు చెల్లించుకోవడం విశేషం. దీనిపై ఇప్పటికి కూడా ఎవరికి అర్థం కాదు.
నాలుగు వందల ఏళ్లుగా వారి జీవన విధానం ఇదే. కానీ ఇది ఎవరికి తెలియదు. దాని ప్రాధాన్యం ఇప్పటికి గుర్తించరు. దాదాపు 18 రోజుల పాటు ప్రయాణించి గమ్యం చేరుకుంటారు. దీనికి ఎవరి ప్రోత్సాహం ఉండదు. ఎవరి సహకారం అవసరం లేదు. కానీ వారిలోని ఐక్యత చూస్తే ముచ్చటేస్తుంది. వారిలో ఉన్న ఐకమత్యం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు.