
Saif Ali Khan: ఎంత పబ్లిక్ ఫిగర్స్, సెలబ్రిటీలైనా వారికి కూడా ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. ప్రతి వ్యక్తికి ప్రైవసీ అనేది కావాలి. అయితే మీడియా ప్రతినిధులు కొన్ని సమయాల్లో హద్దులు దాటేస్తూ ఉంటారు. ఇటీవల అలియా భట్ కి ఒక షాకింగ్ సంఘటన ఎదురైంది. తన పక్క ఇంట్లో నుండి ఇద్దరు వ్యక్తులు రహస్యంగా షూట్ చేయడం చూసి ఆమె షాక్ అయ్యారు. సెన్సేషనల్ న్యూస్ కోసం కొందరు ఇంట్లో ఆమె డైలీ ఆక్టివిటీస్ కూడా చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ఇది పెద్ద న్యూస్ అయ్యింది. అలియాకు సదరు వ్యక్తులపై ఫిర్యాదు చేయాలని కొందరు సలహా ఇచ్చారు. ఇది భద్రతకు సంబంధించిన మేటర్ కావడంతో అలియా సీరియస్ అయ్యారు.
ముంబైలో సెలెబ్రిటీలకు మీడియా తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఎయిర్ పోర్ట్, జిమ్, షాపింగ్ మాల్స్, సినిమా ఈవెంట్స్, ప్రైవేట్ ఫంక్షన్స్ … ఎక్కడికెళ్లినా కెమెరాతో వెంటాడుతూనే ఉంటారు. ఫోటోలకు ఫోజివ్వాలని ఇబ్బంది పెడతారు. తాజాగా బాలీవుడ్ నటి మలైకా అరోరా తల్లి బర్త్ డే వేడుకలు జరిగాయి. ఈ బర్త్ డే పార్టీకి బాలీవుడ్ కి చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. నటుడు సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా కపూర్ తో పాటు వేడుకలో పాల్గొన్నారు.
బర్త్ డే పార్టీ ముగిసిన అనంతరం బయటకు వస్తుండగా మీడియా చుట్టుముట్టింది. ఫోటోలకు ఫోజివ్వాలని కోరారు. సైఫ్ తీవ్ర అసహనానికి గురయ్యారు. మా బెడ్ రూమ్ కి వచ్చి ఫోటోలు తీసుకోండి, అంటూ మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సైఫ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో మీడియా వాళ్ళు సైలెంట్ అయిపోయారు. సైఫ్ దంపతులను ఎలాంటి ఫోటోలు అడగకుండా చూస్తూ ఉండిపోయారు. బాలీవుడ్ లో ఇది హాట్ టాపిక్ అయ్యింది.

సైఫ్ అలీ ఖాన్ 2012లో కరీనా కపూర్ ని రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కరీనా కపూర్ స్టార్ హీరోయిన్ గా పరిశ్రమను షేక్ చేశారు. ఒక దశాబ్దం పాటు ఆమెకు గోల్డెన్ పీరియడ్ నడిచింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే సైఫ్ అలీ ఖాన్ ని వివాహం చేసుకున్నారు. కరీనా అక్క కరిష్మా కపూర్ కూడా స్టార్ హీరోయిన్. ఇక సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య అమృతా సింగ్ కి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అమ్మాయి సారా అలీ ఖాన్ హీరోయిన్ గా రాణిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ ఆదిపురుష్ చిత్రంలో రావణాసురుడు పాత్ర చేస్తున్నారు.